మంత్రి వ‌ర్సెస్ ఎంపీ.. ఆనంద‌య్య మంద‌పై వైసీపీలో ర‌చ్చ‌!

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాలు రోజుకో విధంగా త‌యార‌వుతున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టు ఉండేవి.

 Ap Ycp Leaders Are Troubling Over Supply Of Anandayya Corona Medicine-TeluguStop.com

కానీ ఇప్పుడు వైసీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టు త‌యార‌య్యాయి.చాలా జిల్లాల్లో ప్ర‌స్తుతం ఇదే ప‌రిస్థితి ఉంది.

అయితే ఇప్పుడున్న క‌రోనా ప‌రిస్థితుల్లో ఆనంద‌య్య మందుపై ఎన్ని సంచ‌ల‌నాలు జ‌రుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.ఈయ‌న మందుపై కూడా రాజ‌కీయాలు తీవ్ర స్థాయిలోనే జ‌రుగుతున్నాయి.

 Ap Ycp Leaders Are Troubling Over Supply Of Anandayya Corona Medicine-మంత్రి వ‌ర్సెస్ ఎంపీ.. ఆనంద‌య్య మందుపై వైసీపీలో ర‌చ్చ‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ అన్న‌ట్టు ఆనంద‌య్య మందు రాజ‌కీయాలు న‌డిచాయి.

కానీ ఇప్పుడు ఆనంద‌య్య మందుపై వైసీపీ నేత‌లే ర‌చ్చ‌కు దిగుతున్నారు.

ప్ర‌కాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మ‌ధ్య త‌గ్గ‌పోరు న‌డుస్తోంది.ఆనంద‌య్య మందు పంపిణీకి ఎవరికి వారు విడివిడిగా ఏర్పాట్లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

వీరికి సఖ్యత లేదని స్ప‌ష్టంగా తెలుస్తోంది.ఆనందయ్య క‌రోనా మందుకు వైసీపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌ముందే ఎంపీ ఆధ్వ‌ర్యంలో డీఆర్సీ సమావేశం జ‌రిగింది.

ఇందులో కూడా నేతలకు, అధికారులకు మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రిగింది.

ఇక ఇప్పుడు ప్రభుత్వం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వ‌డంతో గురువారం ఒంగోలులో మంత్రి, ఎంపీ వేర్వేరుగా ఏర్పాట్లు చేయ‌డం రాజ‌కీయ దుమారం రేపింది.

Telugu Anandayya Ayurveda, Anandayya Corona Medicine, Ap And Ycp, Jagan, Ongole Constituency, Troubling, Ycp, Ycp Leaders, Ycp Minister Balineni Srinivasa Reddy, Ycp Mp Magunta Srinivasulu Reddy-Telugu Political News

మంత్రి ఇంటి ద‌గ్గ‌ర ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న వారంద‌రికీ మందు పంపిణీ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు కూడా.

ఇక ఎంపీ కూడా నగరంలోని పీవీఆర్‌ బాలుర హైస్కూల్ ద‌గ్గ‌ర పంపిణీకి ఏర్పాట్లు చేయించారు.మాగుంట తరపున పొగాకు బోర్డు మాజీ సభ్యుడు భద్రిరెడ్డి, ఇతర నేత‌లు రంగంలోకి దిగారు.ఇక ఎంపీ కూడా రాత్రికి ఒంగోలుకు వ‌చ్చి స్లిప్పుల పంచుతారు.అయితే అధికారుల‌కు ఇది త‌ల‌నొప్పిగా మారింది.ఎవ‌రి ద‌గ్గ‌ర భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాలో అర్థం కావ‌ట్లేదు.

ఇద్ద‌రు నేత‌లు స్లిప్పులు పంచ‌డానికి సిద్ధ‌మ‌వ‌డంతో ప్ర‌జ‌లు ఎటువైపు వెళ్లాలో తెలియ‌ట్లేదు.మొత్తానికి వైసీపీలోని లుక‌లుక‌లు ఈ విధంగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

#AnandayyaCorona #AP And YCP #YcpMinister #YcpMp #Troubling

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు