పాల కేంద్రంలో మద్యం అమ్మకాలు..!

ఏపీలో అక్రమ మద్యం కొనుగోలు ఎక్కువగా సాగుతున్నాయి.అక్కడి ప్రభుత్వం మద్యం అమ్మకాలను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకోని బెల్ట్ షాపులను మూసివేశారు.

 Ap, Wine, Police , Srinu, Gunture Tadepally, Ci Subramanyam, Railway Track-TeluguStop.com

అక్కడి మద్యం దుకాణాలను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది.అక్కడ ప్రభుత్వ సమయంలో మాత్రమే మధ్య అమ్మకాలను చేస్తున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని చాలామంది గుట్టుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.గుంటూరు జిల్లా తాడేపల్లిలో అక్రమంగా మద్యం కొనుగోలు చేస్తూ ఇద్దరు పట్టుబడ్డారు.

పూర్తీ వివరాల్లోకి వెళ్తే.

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో నులకపేట గుంటూరు చానల్‌ పక్కన తండ్రీకొడుకులు పాల కేంద్రం నడిపిస్తున్నారు.

అయితే వారు పాల కేంద్రం ముసుగులో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారన్నారు.అయితే వారి వ్యాపారం గురించి గురువారం రాత్రి సీఐ సుబ్రహ్మణ్యంకు సమాచారం అందించారు.దీంతో క్రైమ్ పోలీసులు శ్యామ్, ఉదయ్‌లను ఉన్నతాధికారులు మఫ్టీలో అక్కడికి పంపించారు.

అయితే సాధారణ దుస్తుల్లో వచ్చింది పోలీసులు అని తెలియకి తండ్రీ కొడుకు వారికి మద్యాన్ని అమ్మారు.

తర్వాత ఆ మద్యం బాటిళ్లు ఎక్కడి నుంచి తెచ్చారన్నారు.వారు అడిగిన వెంటనే నిందితులు సరైన సమాధానం ఇవ్వలేదు.

అయితే తండ్రిని విచారిస్తుండగానే కొడుకు శ్రీను ఇంట్లో ఉన్న మద్యాన్ని వేరే ప్రాంతానికి తరలించారు.శ్రీను కాళ్లకు బురద ఉండటాన్ని చూసి అనుమానం వచ్చిన పోలీసులు అతడిని విచారించారు.

Telugu Ci Subramanyam, Railway Track, Srinu, Telangana, Wine-

అయితే శ్రీను మద్యం దాచిన ప్రాంతాన్ని చూపిస్తానంటూ పోలీసులను రైల్వేట్రాక్ వైపుకు తీసుకెళ్లాడు.అయితే అక్కడికి వెళ్ళాక శ్రీను ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నాడు.దీంతో పోలీసులు శ్రీనును వెంబడించి పట్టుకున్నారు.అతను ఇచ్చిన సమాచారంతో 5కేసుల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube