ఇకపై ఏపీలో 25 జిల్లాలు...అంటూ....  

Ap Will Be Built With 25 Districts Says Ys Jagan-

Jagan was speaking at a massive public meeting organized in Ikkappuram ... Srikakulam district ... He announced several guarantees on this occasion. The new Andhra Pradesh will be built with 25 districts. If they come to power, we will bring about changes in the system. Jagan will make every district constituency a district ... Navyaandra will be built with 25 districts.

.

..

..

..

వైసీపీ అధినేత జగన్ సుదీర్ఘ కాలం చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా… శ్రీకాకుళం జిల్లా … ఇచ్ఛాపురం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా అనేక హామీలను ఆయన ప్రకటించారు. 25 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వ్యవస్థలో మార్పులు తీసుకు వస్తానని తెలిపారు. ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామన్న జగన్… 25 జిల్లాలతో నవ్యాంధ్ర నిర్మిస్తామన్నారు. .

ఇకపై ఏపీలో 25 జిల్లాలు...అంటూ....-Ap Will Be Built With 25 Districts Says Ys Jagan

అంతే కాకుండా… కలెక్టర్ల వ్యవస్థను ప్రజలకు దగ్గర చేస్తామని వెల్లడించిన ఆయన… గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం… ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయం తీసుకొస్తాం. మీ గ్రామంలోనే యువతకు ఉద్యోగ అవకాశం ఇస్తామని ప్రకటించారు. ప్రతీ పథకం ప్రతీ పేదవాడి ఇంటికి వెళ్లేలా చేస్తామన్న వైఎస్ జగన్… ప్రతీ గ్రామంలో 50 ఇళ్లకు గ్రామ వాలంటీర్‌ ను నియమిస్తామని హామీ ఇచ్చారు.