ఈజ్ ఆఫ్ డూయిండ్ బిజినెస్ లో ఏపీ టాప్ !

ఏపీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో మరోమారు అగ్రస్థానాన్ని సంపాదించుకుంది.రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యచరణ ప్రణాళిక-2019ను కేంద్రం విడుదల చేసింది.

 Ap, Cm, Ease Of Doing Business, Top-TeluguStop.com

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఈ ప్రణాళిక మీడియాకు వెల్లడించారు.వాణిజ్య విభాగంలో ఏపీ మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టుకుంది.

గతంలో 12వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఈ సారి రెండో స్థానంలో నిలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.కానీ, గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ సారి మూడో స్థానానికి పరిమితమైందన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఆమె అభినందనలు తెలిపారు.పెట్టుబడులు ఆకర్షించడం, రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆరోగ్యకరమైన పోటీల్లో ఈ మూడు రాష్ట్రాలు ముందున్నాయి.

గతంలో 12వ స్థానంలో నిలిచిన ఈ ఏడాది రెండో స్థానానికి చేరిన ఉత్తరప్రదేశ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో జార్ఖండ్, ఆరో స్థానంలో ఛత్తీస్ గఢ్ నిలిచాయన్నారు.

దేశ ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ పదో స్థానంలో నిలిచిందన్నారు.కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ పథకాన్ని అమలు చేయడంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube