ఏపీ: 28 రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి.. తొలి ఫ్యాబ్రికేటెడ్ హాస్పిటల్ విశేషాలివే..!

ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 28 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది.దీన్ని ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్‌తో రాష్ట్రంలో తొలిసారిగా నిర్మించడం విశేషం.

 Ap The Construction Of The Hospital Will Be Completed In 28 Days The First Fabricated Hospital Is Special-TeluguStop.com

ఈ ఆసుపత్రిని ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆవరణలో నిర్మించారు.ఇండో-అమెరికన్ ఫౌండేషన్ సాయంతో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాబ్రికేటెడ్ హాస్పిటల్ కోసం రూ.3.50 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.ఆస్పత్రి పనులన్నీ ఇంకొద్ది రోజుల్లో పూర్తికానున్నాయి.అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిని లాంచనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది.

తాత్కాలిక ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వం నిర్మించిన ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆస్పత్రి 10 నుంచి 15 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉంటుందని ఏపీఎస్‌ఎంఐడీసీ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయాల్లో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్ ఆసుపత్రుల నిర్మాణాలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 Ap The Construction Of The Hospital Will Be Completed In 28 Days The First Fabricated Hospital Is Special-ఏపీ: 28 రోజుల్లోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి.. తొలి ఫ్యాబ్రికేటెడ్ హాస్పిటల్ విశేషాలివే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఒంగోలులో నిర్మించిన ఈ హాస్పిటల్ ని కరోనా రోగుల కోసమే యూజ్ చేయనున్నారు.ఇందులో 11 బ్లాక్ లు ఉండగా.

వాటిలో ఓపీ సేవలకు ఒక బ్లాక్, డ్యూటీ డాక్టర్లు ఉండేందుకు మరో బ్లాక్ కేటాయించనున్నారు.మిగతా 9 బ్లాక్ లను కరోనా పేషెంట్స్ కోసం యూజ్ చేస్తారు.

వీటిలో మళ్ళీ 8 ఐసీయూ బెడ్స్, మిగిలినవి నాన్ ఐసీయూ బెడ్స్ ఉంటాయి.

Telugu 28 Days 100 Beds Hospital, Andhra Pradesh, Ap Fabricated Hospital, Construction, Hospital, Latest News, Minister Balineni, Ongole, Prakasham District, Special-Latest News - Telugu

త్వరలోనే ఇలాంటి మరిన్ని ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది ఏపీ సర్కార్.వాటిలో రోగుల కోసం 9 బ్యాక్‌లు ఉంటాయి.ఒక్కో బ్యాక్‌లో 13 మంది రోగులు చికిత్స పొందొచ్చు.

ప్రతి పడక వద్ద సీలింగ్ ఫ్యాన్ తో సహా బాత్రూమ్, టాయిలెట్, విద్యుత్, తాగునీటి సౌకర్యం.ఇలా చాలా సౌకర్యాలు ఉంటాయి.

#Prakasham #Beds #Andhra Pradesh #Balineni #Ongole

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు