అమెరికాలో చిరంజీవి కి నిరసన..       2018-04-30   13:04:51  IST  Bhanu C

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగు సినీ పరిశ్రమ కూడా పోరాటం చేయాలని అమెరికాలో నివసిస్తు్న్న ప్రవాసాంధ్రులు చిరంజీవి ని డిమాండు చేశారు. ఈ సందర్భంగా డాలస్‌లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ వేడుకల వద్ద చిరంజీవి కి ప్లకార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు.ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినధలు చేశారు. ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే తెలుగు తారలు మౌనంగా ఉండటం తగదన్నారు.

‘మా’ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ ఈ నెల 28, 29 తేదీల్లో డాలస్‌లో వేడుకలు జరుపుతున్నారు. ఇందులో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు నటీ నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రవాసాంధ్రులు మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో జల్లికట్టు, కావేరీ విషయంలో తమిళ నటీనటులంతా ఏకమై పోరాడితే.. తెలుగు నటీ నటులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఆరాధిస్తుంటే.. కనీసం వారి కోసం కొంత సమయం కేటాయించలేరా అని ప్రశ్నించారని ఓ మీడియా కథనం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వారి ఆస్తులు లేకపోవడం వల్లే సినీ పరిశ్రమ స్పందించడం లేదని, ఏపీపై చిన్నచూపు తగదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొంది.

-
-