ఈ నెలలోనే ఉప ఎన్నికలు ? బద్వేల్ టూ హుజురాబాద్ 

సార్వత్రిక ఎన్నికల స్థాయిలో ఉపఎన్నికల పైన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశక్తి, టెన్షన్ నెలకొంది.టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన దగ్గర నుంచి హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కాయి.

 Ap Telangana By Elections Are Likely To Beheld This Month Hujurabad Elections, B-TeluguStop.com

నియోజకవర్గంలో గెలుపు కోసం టిఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.అధికార దర్పం ప్రదర్శిస్తూ, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ఈ నియోజకవర్గంలో అమలు చేస్తోంది.

అలాగే టిఆర్ఎస్ తరఫున శ్రీనివాస్ యాదవ్ ను ఎంపిక చేయడంతో, ఆయన గెలుపు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు రంగంలోకి దించి, తమ ప్రధాన ప్రత్యర్థి ఈటల రాజేందర్ ను ఓడించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.బిజెపి కూడా ఈటెల రాజేందర్ కోసం గట్టిగా కష్టపడుతోంది.

ఇక రాజేందర్ సైతం గెలుపు నమ్మకంతో ఉన్నారు.

కాకపోతే ఎన్నికల నోటిఫికేషన్ కోసం కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ఇలా అందరూ ఎదురుచూపులు చూస్తున్నారు.

త్వరగా ఈ ఎన్నికల తంతు ముగిస్తే, తమకు అనుకూలంగా ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.వాస్తవంగా ఆగస్టులోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని అందరూ అంచనా వేసినా, ఎన్నికల సంఘం మాత్రం పెద్దగా స్పందించలేదు.

కాకపోతే ఆగస్టు 28 వ తేదీన అన్ని పార్టీల నాయకుల అభిప్రాయాలను ఎన్నికల సమయంలో తీసుకుంది.ఈ క్రమంలో సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లుగా అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి.

Telugu Badvel, Congress, India, Etela Rajendar, Hujurabad, Revanth Reddy, Telang

అలాగే ఏపీలో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య ఆకస్మికంగా మరణించడంతో ఇక్కడ ఎన్నికలు అనివార్యం అయ్యాయి.ఆయన ఈ ఏడాది మార్చి 28వ తేదీన చనిపోయారు.సెప్టెంబర్ 28 నాటికి ఆరు నెలలు పూర్తవుతాయి.ఎన్నికల సంఘం నిబంధనల మేరకు శాసన సభ్యుడు మరణించినా లేదా రాజీనామా చేసినా, ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే  ఎన్నికల సంఘం పైన ఒత్తిడి ఉంది.ఈ క్రమంలోనే ఇటు బద్వేల్ టు హుజూరాబాద్ నియోజకవర్గం సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, ఈ నెలలోనే అది పూర్తవుతుందని అన్ని పార్టీలు అంచనావేయడంతోనే ఇప్పటికిప్పుడు హడావుడి పెంచుతూ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసినట్లు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే హుజురాబాద్ తోపాటు బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది.  కాకపోతే హుజూరాబాద్ తరహాలో బద్వేల్ నియోజకవర్గం లో పెద్దగా హడావుడి అయితే కనిపించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube