లోకేష్ టీడీపీ పై అచ్చెన్న  షాకింగ్ కామెంట్స్ ? సోషల్ మీడియాలో వైరల్ !

టీడీపీ ఏపీ అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు ఓ  ప్రైవేట్ హోటల్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు లోకేష్ కు సంబంధించిన వ్యవహారం పై అచ్చెన్న కు ఫిర్యాదు చేస్తూ, తాను ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడినా,  కనీస గౌరవం ఇవ్వడం లేదని, మొదట్లో తనను అన్నా అంటూ పిలిచిన లోకేష్ ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోకుండా,  ఫోన్ కూడా ఎత్తడం లేదని,  తాము కుటుంబ సమేతంగా రోడ్డున పడిపోయాము అని , ఈ విషయం లోకేష్ వద్ద ప్రస్తావిస్తే కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకోవాలని చెబుతున్నారు అంటూ ఏక వచనం తో లోకేష్ పై తీవ్ర పదజాలం తో సదరు నాయకుడు విరుచుకుపడడం,  దీనికి సమాధానంగా లోకేష్ ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు వాడే సరిగ్గా ఉంటే , మన పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటూ వ్యాఖ్యానించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

 Ap Tdp President Achhennaidu Viral Comments On Lokesh And Tdp-TeluguStop.com

17 తరువాత ఎన్నికల అయిపోతే ఫ్రీ అయిపోతాము అని,  పార్టీ లేదు ***** లేదు అంటూ  అచ్చెన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.అయితే ఇదంతా రహస్యంగా వీడియో రూపంలో చిత్రీకరించడం తో,   సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు.

ఇప్పుడు సదరు వీడియోను వైసీపీ సోషల్ మీడియా జనాల్లో పూర్తిగా తీసుకువెళ్ళడంతో పెద్ద సంచలనంగా మారింది.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.తిరుపతి ఉప ఎన్నికలలో ఏదో రకంగా గెలవాలి అని చూస్తోంది.కానీ ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న ఆ పార్టీ పరిస్థితిపై ఆందోళన గా ఉండడం తో,  ఇక టీడీపీ పని అయిపోయింది అంటూ వైసీపీ కామెంట్స్ మొదలు పెట్టింది.

 Ap Tdp President Achhennaidu Viral Comments On Lokesh And Tdp-లోకేష్ టీడీపీ పై అచ్చెన్న  షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై టీడీపీ  సైలెంట్ అయిపోయింది.

ఈ వ్యవహారంలో ఏ విధంగా స్పందించాలో తెలియని పరిస్థితి నెలకొంది.

ఇప్పటికే లోకేష్ ని ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు.ఆ బాధ్యతలు అచ్చెన్న కు సైతం అప్పగించారు.

కానీ ఇప్పుడు అదే అచ్చెన్న లోకేష్ పై ఈ విధంగా వ్యాఖ్యానించడం తో ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.

#Chandrababu #Lokesh #AchhennaViral #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు