సంచులనూ వదలడం లేదంటూ .. అచ్చెన్న పంచ్ లు ? 

వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా, దానిని వదిలిపెట్టకుండా దానిని సద్వినియోగం చేసుకుంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఉంటారు టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు. తాజాగా ఏపీ వ్యాప్తంగా రేషన్ డీలర్లు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని,  రేషన్ డీలర్ల సమస్యపై పోరాడేందుకు తాము ముందుంటామని అచ్చెన్న నాయుడు ప్రకటించారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో,  అన్ని విధాలుగా రేషన్ డీలర్లకు సహకరించిందని , కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం రేషన్ డీలర్లను కేవలం స్టాకిస్టులు గా పేర్కొంటూ వాటి ప్రభావం నామమాత్రం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రేషన్ డీలర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

 Ap Tdp President Achhennaidu Sensational Comments On Ysrcp Government-TeluguStop.com

” టిడిపి హయాంలో రేషన్ డీలర్లకు గౌరవ వేతనం అందించాం.గోనె సంచులను అమ్ముకుని కొంత ఆదాయం పొందేలా వెసులుబాటు కల్పించాం.ప్రస్తుతం వాటిని కూడా ప్రభుత్వానికి అందించాలంటూ జీవో ఇచ్చి డీలర్ల పై పెత్తనం చేస్తున్నారు.గతంలో ఉన్న సదుపాయాలన్నిటినీ రద్దు చేయడమే కాకుండా, వలంటీర్లు, మొబైల్ వాహనాల పేరుతో డీలర్ల ను డమ్మిలుగా చేశారు.మరోవైపు కరోనా సమయంలో పంపిణీ చేసిన ఉచిత రేషన్ సరుకులకు సంబంధించిన కమిషన్ కూడా ఇవ్వలేదు.

కరోనా ఉదృతంగా విజృంభించిన సమయంలోనూ పేదలకు రేషన్ సరుకులు అందించిన వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించాలని ఎన్ని వినతులు ఇచ్చినా, ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు.
 

 Ap Tdp President Achhennaidu Sensational Comments On Ysrcp Government-సంచులనూ వదలడం లేదంటూ.. అచ్చెన్న పంచ్ లు  -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Ap, Ap Tdp, Ap Tdp President, Chandrababu, Jagan, Jagan Government, Kinjarapu Achhennaidu, Mobile Ration Vehicles, Ration Dealers, Ration Dealers Protest, Tdp, Ysrcp-Political

ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 54 మంది డీలర్లు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతే కనీస పరిహారం కూడా ఇవ్వలేదు.తెలుగుదేశం ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పదుల సంఖ్యలో సరుకులను అందించి పేదలకు అండగా నిలిచింది.కానీ నేడు రేషన్ షాప్ కంటే బహిరంగ మార్కెట్ ఉత్తమం అనే పరిస్థితి కి తీసుకు వచ్చారు.

టిడిపి డీలర్ల సంక్షేమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, రేషన్ వ్యవస్థను పటిష్టం చేస్తే, జగన్ రెడ్డి రేషన్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి.

డీలర్లు చేసే నిరసన కార్యక్రమాల తో పాటు , భవిష్యత్తులో చేసే పోరాటాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది ” అంటూ అచ్చెన్న రేషన్ డీలర్ల కు భరోసా ఇచ్చారు.

#Chandrababu #AP TDP #Vehicles #Dealers #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube