ఆ ఏపీ ఎమ్మెల్యే టీడీపీ టు కాంగ్రెస్‌లోకి జంపా     2016-12-21   00:58:21  IST  Bhanu C

ఈ వార్త విన‌డానికి కాస్త షాకింగ్‌గానే ఉండొచ్చు..ఏపీలో నాయ‌కులే లేని కాంగ్రెస్‌లోకి అధికార టీడీపీలో ఉన్న ఎమ్మెల్యే జంప్ చేయ‌డం ఏంటా అన్న ప్ర‌శ్నే చాలా తిర‌కాసుగా ఉండొచ్చు…మ‌రి అంతలా రివ‌ర్స్‌లో ఆలోచిస్తోన్న ఆ ఎమ్మెల్యే ఎవ‌రు ? ఆయ‌న చూపులు కాంగ్రెస్ వైపు ఎందుకు ఉన్నాయో చూద్దాం. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ టీడీపీలో ఇమడలేకపోతున్నారట.

కాంగ్రెస్‌లో సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌గా ఉన్న ఆయ‌న అక్క‌డ మంత్రిగా కూడా ప‌నిచేశారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న మంత్రి ప‌ద‌వి ఆశించి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జంప్ చేశారు. టీడీపీలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ముఖ్యంగా జిల్లా నాయ‌క‌త్వంతో పొస‌గ‌క‌పోవ‌డంతో ఆయ‌న అటు వైకాపాలోకి వెళ్ల‌లేక ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే ఆలోచనలోనూ ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కనుక మళ్లీ కాంగ్రెస్ లోకి చేరితే మండలి కూడా కాంగ్రెస్ వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.

మండ‌లి కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగి అక్క‌డ వివిధ హోదాల్లో ప‌ద‌వులు అనుభ‌వించారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారిలో చాలామందితో పోలిస్తే ఆయ‌న‌కు చంద్ర‌బాబు స‌రైన రీతిలోనే డిప్యూటీ స్పీక‌ర్ ఇచ్చారు.ఇక జిల్లాలో మంత్రి ఉమాతో ఆయ‌న‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఉమ తీరుపై బుద్ధ ప్ర‌సాద్ తీవ్ర స్థాయిలో ర‌గిలిపోతున్నార‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి.

బుద్ధ‌ప్ర‌సాద్ మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నా ఆ కోరిక నెర‌వేరేలా లేదు. ఇప్ప‌టికే జిల్లా నుంచి ఉమా-కామినేని శ్రీనివాస్‌-కొల్లు ర‌వీంద్ర మంత్రులుగా ఉన్నారు. ఈ టైంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చే ఛాన్సులు లేవు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌లో ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు టీడీపీలో ఉండ‌వ‌ని త‌న అసంతృప్తిని బ‌హిరంగంగానే వ్య‌క్తం చేస్తున్నార‌ట‌.ఈ క్ర‌మంలోనే బుద్ధ ప్ర‌సాద్ కాంగ్రెస్ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్నార‌ని, కాంగ్రెస్‌ను చిన్న మాట కూడా అన‌డం లేద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం బుద్ధ ప్ర‌సాద్ పొలిటిక‌ల్ కార్య‌క్ర‌మాల‌కంటే భాషా, సంస్కృతిక కార్య‌క్ర‌మాలు, సన్మాన‌, స‌త్కార స‌భ‌ల‌కు వెళుతూ కాల‌క్షేపం చేస్తున్నార‌ట‌. ఏదేమైనా మాజీ సీఎం కిర‌ణ్ పొలిటిక‌ల్ రూటును బ‌ట్టి బుద్ధ ప్ర‌సాద్ సైతం కొత్త రాజ‌కీయ దారులు వెతుక్కునే ప‌నిలో ఉన్నార‌ట‌.