ఉలకరు పలకరు ! పదవులిచ్చినా ప్రయోజనం ఏంటో ?

బలమైన రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు.40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఎన్నో విపత్కర పరిస్థితులను ఆయన ఎదుర్కుంటూ వచ్చారు.ఇటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రతిసారి, బాబు బుర్రకు పదును పెట్టి మరీ పైచేయి సాధిస్తూ ఉంటారు.ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీ దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది.

 Ap Tdp Leaders Fear On Jagan , Ys Jagan, Ap, Tdp Leaders, Chandrababu Naidu, Atc-TeluguStop.com

ప్రతి విషయంలోనూ తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసుకుంటూ అధికార పార్టీ నాయకులు ముందుకు వెళ్తున్నారు.అవకాశం దొరికితే వదిలిపెట్టకుండా ఎడాపెడా కేసులు నమోదు చేస్తూ, అనేక రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

వీటన్నిటి నుంచి పార్టీ క్యాడర్ ను బయట పడేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు.

అయినా పార్టీ లో వలసలు పెరిగిపోతుండడంతో, పార్టీ కేడర్ లో నిరుత్సాహం అలుముకుంది అనే విషయాన్ని గ్రహించిన బాబు కొత్తగా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి లను నియమించారు.

వారి నియామకం చేపట్టి చాలా కాలమే అయింది.అయినా వారెవరూ పెద్దగా యాక్టివ్ గా ఉండకపోవడం, తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో ప్రభుత్వంపై పోరాటం చేసే అవకాశం వచ్చినా, ఎవరూ నోరు మెదపడం లేదు.

వారితో పాటు, కొత్తగా రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పార్టీ పదవులను భర్తీ చేసినా, పార్టీ క్యాడర్ లో పెద్దగా ఉత్సాహం కనిపించడంలేదు అనేది చంద్రబాబు కి అందిన రిపోర్ట్.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు నోరెత్తి మాట్లాడేందుకు సాహసించడం లేదని, అమరావతి ప్రస్తావన ఎత్తితే, తమ  ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయి అని వారంతా జంకుతున్నారట .మిగతా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు సైతం ఇదే రకమైన వైఖరితో ఉండడం, వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేయాల్సిందిగా పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా, బాబు మాటను సైతం పెద్దగా ఎవరూ లెక్కచేయనట్టుగానే వ్యవహరిస్తుండడంతో పదవులు వచ్చినా నాయకుల్లో కానీ కింది స్థాయి నాయకుల్లో కానీ ఇంకా భయం పోలేదు అనే వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించబడిన అచ్చెన్నపైనే బాబు ఆశలు పెట్టుకున్నారు.

ఆయన అయినా దూకుడుగా ముందుకు వెళ్లి పార్టీ క్యాడర్ లో ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం ఆయన పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube