కరోనా కట్టడి వదిలి రాజకీయ కక్ష.. జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్..!

ఏపీ సిఎం వై.ఎస్.

 Ap Tdp Leader Atchennaidu Fires On Ap Cm Ys Jagan-TeluguStop.com

జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.తాడేపల్లిలో కూర్చొని ప్రధాని మోడీకి లెటర్ లేఖలు రాస్తే ప్రయోజనం ఉండదని అన్నారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజకీయాలను పక్కన పెట్టాలని కరోనా నియంత్రణ మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని అచ్చెన్నాయుడు అన్నారు.జగన్ అనాలోచిత చర్యల వల్లే సెకండ్ వేవ్ తీవ్రత పెరిగిందని.

 Ap Tdp Leader Atchennaidu Fires On Ap Cm Ys Jagan-కరోనా కట్టడి వదిలి రాజకీయ కక్ష.. జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరోనా కట్టడిని వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు అచ్చెన్నాయుడు.

అనంతపురంలో ఆక్సిజన్ అందక జిల్లా స్థాయి అధికారి కూడా మృతి చెందారని ప్రభుత్వ అసమర్ధత వల్లే వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగా జరగడం లేదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కొత్తగా బ్లాక్ ఫంగస్ ప్రజలను ఇబ్బంది పెడుతుందని.దానికి అయ్యే చికిత్స ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఓ పక్క సరైన ట్రీట్ మెంట్ అందక కరోనా బాధితులు ఇబ్బందులు పడుతుంటే రాజకీయ కక్ష సాధింపుకు ఇది సరైన సమయం కాదని అచ్చెన్నాయుడు ఏపీ ప్రభుత్వాన్ని సిఎం జగన్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని బ్లాక్ ఫంగస్ చికిత్సని ఆరోగ్య శ్రీ కార్డ్ మీద ట్రీట్ మెంట్ చేయించుకునేలా సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు.

#Aarogya Sri #TDP Atchennaidu #TDp Leader #Fires #Ap Corona Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు