కరోనా మహమ్మారి నేపథ్యంలో సరిహద్దుల్లో గోడ,ఎక్కడంటే

అగ్రరాజ్యం అమెరికా,పొరుగు దేశం మెక్సికో ల మధ్య భారీగా సరిహద్దు గోడ నిర్మించడం తో ప్రపంచ దేశాల్లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం విదితమే.అయితే రెండు దేశాల మధ్య సరిహద్దు గోడ గురించి విన్నాం.

 Ap Tamilnadu Border, Wall, Corona Effect, Chittoor, Tamilnadu-TeluguStop.com

కానీ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గోడ గురించి మాత్రం తెలుసుకోవలసిందే.ఇంతకీ ఇది ఎక్కడో జరిగింది అని అనుకుంటే పొరపాటే భారతదేశంలోనే ఇలా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు గోడ నిర్మించడం తీవ్ర సంచలనం సృష్టించింది.

కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.అయితే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండం ఆందోళన కలిగిస్తుంది.

ఇప్పటికే ఈ కేసులు 1000 కి పైగా పెరగడం తో అధికారులు మరింతగా అప్రమత్తమై చర్యలు చేపట్టారు.
జిల్లాల వారీగా ఇంటింటికి ఆశా వర్కర్లు,గ్రామ వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించాలన్న యోచన కూడా చేస్తుంది ఏపీ సర్కార్.

అయితే తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్న ఏపీ సర్కార్ కు తమిళనాడు ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చింది.తమిళనాడు,ఏపీ సరిహద్దుల్లో అనూహ్యంగా గోడ నిర్మించి ఏపీ సర్కార్ కు ఝలక్ ఇచ్చింది.

ఏపీ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం తో తమిళనాడు సరిహద్దు వద్ద 6 అడుగుల మేరకు గోడ నిర్మించినట్లు తెలుస్తుంది.వేలూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో స్థానిక అధికారులు తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే మూడు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

దీంతో ఈ విషయాన్ని స్థానికులు చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం తో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది.ఇలా రాష్ట్రాల సరిహద్దుల్లో గోడ నిర్మించడం పై ఏపీ సర్కార్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఉన్నట్టుండి సరిహద్దుల మధ్య గోడ నిర్మించడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుపడుతుంది.మరి దీనిపై ఇరు రాష్ట్రాల సీఎం లు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube