ల్యాప్ టాప్ లపై జగన్ తీసుకున్న నిర్ణయానికి ఎగిరి గంతులేస్తున్న ఏపీ స్టూడెంట్లు..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు.ఈ సందర్భంగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గల కారణం పేద పిల్లలకు ఉన్నత చదువులు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే అని చెప్పుకొచ్చారు.

 Ys Jagan,amma Vodi Scheme,nellore,padayatra, Amma Vadi, Ysrcp, Jagan Mohan Reddy-TeluguStop.com

అంతేకాకుండా రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు రాబోతున్నట్లు జగన్ స్పష్టం చేశారు.పాదయాత్ర లో చాలా మంది పేద వాళ్ళ పిల్లల దుస్థితిని తెలుసుకోవటం బట్టే ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమానికి 6773 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో 44,48,000 తల్లుల ఖాతాలో “అమ్మ ఒడి” పథకం డబ్బులు పడబోతున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం చాలావరకూ డిజిటల్ తరహాలో క్లాసులో జరుగుతున్న తరుణంలో దాదాపు 25 వేల రూపాయలకు పైగా ఖరీదు చేసే ల్యాప్ టాప్ ని 18 వేల రూపాయలకే ప్రభుత్వం ఇవ్వనున్నట్లు జగన్ స్పష్టం చేశారు.పెద్దపెద్ద కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Telugu Nellore, Padayatra, Ys Jagan-Telugu Political News

అత్యాధునిక ఫీచర్లతో ఈ ల్యాప్ టాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జగన్ స్పష్టం చేయడంతో ఈ వార్త తెలుసుకున్న ఏపీ లో ఉన్న స్టూడెంట్లు ఎగిరి గంతులేస్తున్నారు.వీలైతే రాబోయే ఏడాది “అమ్మబడి” పథకం లో ల్యాప్ టాప్ అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా జగన్ తెలపటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టూడెంట్ లతో పాటు తల్లిదండ్రులు కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube