అమెరికా గడ్డపై సత్తా చాటిన తెలుగు యువకుడు...!!

అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల ప్రతిభ ఎప్పుడూ వికసిస్తోనే ఉంటుంది.స్వదేశాన్ని విడిచి ఉన్నత ఉద్యోగాల కోసమో, ఉన్నత చదువులు , వ్యాపారాల కోసం ఎంతో మంది భారతీయులు వలసలు వెళ్ళేవారు.

 Ap Student Receives Doctorate In Astrophysics From Umkc University America-TeluguStop.com

అలా వెళ్ళిన వారు అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో భారత సంతతి కుటుంభాలు లక్షల్లోనే ఉన్నాయి.

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి తమ ప్రతిభతో ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుని, అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న యువకులు తమదైన నైపుణ్యంతో అగ్ర రాజ్యంలో తమ సత్తా చాటుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా

 Ap Student Receives Doctorate In Astrophysics From Umkc University America-అమెరికా గడ్డపై సత్తా చాటిన తెలుగు యువకుడు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ ప్రవాసాంధ్రుడు అమెరికాలో తన అత్యుత్తమమైన ప్రతిభతో చరిత్ర సృష్టించాడు, తెలుగోడి సత్తా చాటి చెప్పాడు.ఏపీలోని విశాఖ జిల్లా సీలేరు కు చెందిన భరద్వాజ్ అనే యువకుడు ప్రస్తుతం అమెరికా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు.2014 లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన భరద్వాజ్ యూఏంకెసి యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రం లో పీహెచ్డీ చేస్తున్నారు.నక్షత్ర మండలంలో నక్షత్రాలు ఒకదానికి ఒకటి డీ కొట్టుకునే విషయంపై లోతైన పరిశోధనలు చేసిన అతడి పరిశోధనలకుగాను యూఏంకెసి వర్సిటీ నుంచీ డాక్టరేట్ పొందారు.అయితే ఎంతో మంది డాక్టరేట్ పొంది ఉంటారు కదా అంత స్పెషల్ గా భరద్వాజ్ గురించి చెప్పుకోవాల్సిన ఎందుకు వచ్చిందంటే.

యూఏంకెసి యూనివర్సిటీ చరిత్రలో కేవలం ఖగోళ శాస్త్రంపై పరిశోధనలు చేసి డాక్టరేట్ సాధించిన వ్యక్తి ఇప్పటి వరకూ ఎవరూ లేకపోవడంతో భరద్వాజ్ డాక్టరేట్ సాదించిన మొట్ట మొదటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.భరద్వాజ్ చిన్న నటి నుంచే చదువుల్లో చక్కని ప్రతిభ కనబరిచేవారని తల్లి తండ్రులు చెప్తున్నారు.

హైదరాబాద్ లో విద్య తరువాత విజయవాడలో బీటెక్ పూర్తి చేశారు.ఆ తరువాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు.

ఆయన పరిశోధనాత్మకమైన ప్రతిభ నచ్చిన పలు కంపెనీలు ఆయన పరిశోధనలకు ఉపాకారవేతనాలు అందించాయి.అంతేకాదు భరద్వాజ్ ప్రతిభకు అస్త్రోనామికల్ సొసైటీ గోల్డ్ మెడల్ కుడా అందించింది.

ఈ విషయంపై భరద్వాజ్ కుటుంభ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#UKMC #AP Bahradwaj #APDoctorate #Astrophysics #America

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు