వేలెత్తిన బాబు ? ఏపీ అసెంబ్లీ లో రచ్చ రచ్చ ?

ఏపీ అసెంబ్లీ నిన్న ప్రారంభమైన దగ్గర నుంచి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడీవేడిగా అన్ని అంశాలలో చర్చ జరుగుతోంది.అధికార పార్టీ నిర్ణయాలపై అడుగడుగున అభ్యంతరం తెలుపుతూ , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అడుగడుగున అధికారపార్టీ వైసీపీ ని రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో చంద్రబాబు తో సహా 12 మంది ఎమ్మెల్యేలను నిన్ననే ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్ణయం చేసుకున్నారు .

 Ap Speaker Vs Tdp Chief Chandrababu War, Ap Assembly, Chandrababu, Jagan, Tammin-TeluguStop.com

తాజాగా ఈరోజు అసెంబ్లీలోనూ,  అదే రకమైన పరిస్థితి నెలకొంది.టిడ్కో ఇళ్ల కేటాయింపుపై చర్చ జరగగా,  ఈ వ్యవహారంపై పెద్ద చర్చ జరిగింది.

ఇది పెద్ద చర్చగా మారింది.ఈ సందర్భంగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైపు టీడీపీ అధినేత చంద్రబాబు వేలెత్తి చూపిస్తూ మాట్లాడడం పై వివాదం చెలరేగింది.

తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ ని చంద్రబాబు కోరే క్రమంలో వేలెత్తిచూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడం పై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా మండిపడ్డారు.

Telugu Ap Assembly, Chandrababu, Jagan, Ysrcp-Telugu Political News

 మీ బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ ఏం వేలెత్తి వార్నింగ్ ఇస్తావా ? నీ శాపనార్థాలు భయపడను.స్పీకర్ పోడియం లోకి వచ్చి బెదిరిస్తారా ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు ?” అంటూ తన చేతిలోని పేపర్లను విసిరేశారు ఏపీ స్పీకర్.ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు తమ సీట్లోంచి లేచి నిలబడి స్పీకర్ పై విమర్శలు చేశారు.తమ చేతుల్లోని పేపర్లను విసిరేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు చంద్రబాబు.స్పీకర్ వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఏపీ సీఎం జగన్ ఈ వ్యవహారంపై స్పందించారు.

పేపర్లు స్పీకర్ వైపు విసిరి ఆయనపై  వేలెత్తి చూపిస్తారా అంటూ చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక ప్రొసీజర్ ప్రకారం సభ ముందుకు వెళ్తుటే మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలా అంటూ జగన్ ప్రశ్నించారు.

సభలో పద్ధతిగా వ్యవహరించాలని సూచించారు.స్పీకర్ పై అనుచితంగా వ్యవహరించిన మీరు వెంటనే  క్షమాపణ చెప్పాలంటూ జగన్ డిమాండ్ చేశారు.40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube