టీడీపీ నేతల ఊగిసిలాట వెనుక కారణం ఏంటి ?  

Ap Some Tdp Leaders In Confusion-

ఏపీ టీడీపీ నేతలు, కొంతమంది ఎమ్యెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే పార్టీ మారిన రాజ్యసభ సభ్యుల ద్వారా బీజేపీ అగ్ర నేతలతో సంప్రదింపులు చేశారు.వారికి రావాల్సిన హామీలన్నీ వచ్చాయి.ఇక రేపో మాపో పార్టీ మారిపోవడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆ ప్రతిపాదనకు బ్రేక్ పడింది.

Ap Some Tdp Leaders In Confusion- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Ap Some Tdp Leaders In Confusion--Ap Some Tdp Leaders In Confusion-

బీజేపీ కండువా కప్పుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.ఈ పరిణామాలు బీజేపీని కూడా కలవరానికి గురిచేస్తున్నాయి.అసలు ఎందుకు ఇలా అవుతోంది, నేతలు ఎందుకు వెనకడుగు వేస్తున్నట్టు అనే విషయాన్ని ఆరా తీస్తోంది.నెల రోజుల ముందు వరకు పార్టీ మారేందుకు ఉత్సాహం చూపించిన వారు ఇప్పుడు టీడీపీలో కొనసాగాలనుకోవడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయట.

Ap Some Tdp Leaders In Confusion- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Ap Some Tdp Leaders In Confusion--Ap Some Tdp Leaders In Confusion-

టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పుంజుకోవడం కష్టమనే భావనతో చాలామంది నాయకులు పార్టీ వీడాలనుకున్నారు.ఈ సమయంలో వారికి ప్రత్యామ్న్యాయంగా కనిపించింది బీజేపీ.ఎందుకంటే వైసీపీ నుంచి వారి చేరికకు అంత అనుకూల వాతావరణం లేకపోవడంతో వీరికి బీజేపీనే పెద్ద దిక్కుగా కనిపించింది.ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే దాదాపుగా 17 మంది వరకు ఒకేసారి బయటకొచ్చి ప్రత్యేక గ్రూప్‌గా తమను పరిగణించాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరాల్సి ఉంటుంది.వేరువేరుగా ఎవరైన బయటకొస్తే వేటు తప్పదని సీఎం జగన్ హెచ్చరించడంతో బీజేపీ లో చేరికకు టీడీపీ ఎమ్యెల్యేలు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా రాయలసీమకు చెందిన నేతలు బీజేపీలో చేరతారంటూ ముందుగా బాగా ప్రచారం జరిగింది.ఎప్పటి నుంచో టీడీపీలో నమ్మకంగా ఉన్న నాయకులు కూడా పార్టీ మారుతారని ప్రచారం జరిగింది.

ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గాయపడిన వారిని, చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర మొదలుపెట్టాడు.వారికి ఆర్థిక సాయం చేసి ధైర్యంచెప్పడంతో పాటు కొండంత భరోసా కల్పించారు.

ఈ సమయంలో చంద్రబాబు పర్యటనకు విశేష స్పందన వచ్చింది.దీంతో పార్టీ మారాలన్న వారిలో కొంచెం మార్పు వచ్చినట్టు తెలుస్తోంది.గతానికి భిన్నంగా పార్టీ కార్యకర్తలను చంద్రబాబు విరామం లేకుండా కలుసుకోవడం, వారితో ఆప్యాయంగా మాట్లాడటం వంటి అంశాలు క్యాడర్‌నీ, నేతలనీ ప్రభావితం చేస్తున్నాయన్న చర్చ కూడా ఇప్పుడు టీడీపీలో జరుగుతోంది.బీజేపీ కూడా ఇదే కారణంతో చేరికలు వాయిదా పడ్డాయని భావిస్తోంది.