ఇసుక ఎఫెక్ట్ : విశాఖలో ఐటీ కంపెనీపై సీఐడీ దాడులు

ఏపీలో మొదలయిన ఇసుక తుఫాను ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ప్రత్యర్థి పార్టీ లు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోయింది.

 Ap Sand Web Portal Hacked Cid Searches Blue Frog Office-TeluguStop.com

ఇక రెండు రోజుల క్రితమే టీడీపీ వైసీపీపై చార్జిషీట్ అంటూ ఓ జాబితాను విడుదల చేసింది.అందులో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారు వీరే అంటూ కొంతమంది వైసీపీ మంత్రులు, నాయకుల పేర్లు విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో ఇసుక కొరత వెనక కొంతమంది వ్యక్తుల హస్తం ఉన్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం అందడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.దీనిపై ఆరా తీయగా ఏపీ ప్రభుత్వ ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి కృతిమ కొరత సృష్టించినట్లు తెలుస్తోంది.

బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్టు తేలిపోయింది.బ్లూ ఫ్రాగ్‌ సంస్థ‌కు చెందిన పలువురు వ్యక్తులు సైట్‌ను హ్యాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించినట్లు సీఐడీకి ఫిర్యాదు అందాయి.

వెంటనే ఈ విషయంపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన సీఐడీ విశాఖలో ఉన్న బ్లూ ఫ్రాగ్స్ కార్యాలయంలో సోదాలు చేసింది.సర్వర్‌ని హ్యాక్ చేసి కోడ్ ద్వారా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా సీఐడీ అధికారులు గుర్తించారు.

కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి అనేక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే బ్లూ ఫ్రాగ్ కంపెనీ లో లోకేష్ కు వాటాలు ఉన్నట్టుగా ఇప్పటికే వైసీపీ ఆరోపణలు చేయడం, దానికి లోకేష్ సవాల్ విసరడం జరిగిపోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube