ఏపీ ఎన్నికల కమిషనర్ ని తొలగించిన జగన్ సర్కార్  

Ap Politics Ysrcp Ap Cm Jagan Nimmagadda Ramesh Kumar Ap Elections - Telugu Andhra Pradesh Govt Issues Ordinance To Expel Sec, Ap Cm Jagan, Ap Politics, Ysrcp

దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంపై అప్పుడు జగన్ సర్కార్ లో ముఖ్యమంత్రి జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తీవ్ర విమర్శలు చేశారు.

 Ap Politics Ysrcp Ap Cm Jagan Nimmagadda Ramesh Kumar Ap Elections

కులం అంటగట్టి చంద్రబాబుతో జతకట్టి విమర్శలు చేశారు.అయితే ప్రస్తుతం ఏపీలో రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా పరిస్థితులలో ఎన్నికల కమిషనర్ సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రజల నుంచి కూడా వస్తున్న స్పందన ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ జీవో జారీ చేసింది.ఆర్డినెన్స్ ద్వారా రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పించింది.

ఏపీ ఎన్నికల కమిషనర్ ని తొలగించిన జగన్ సర్కార్-Latest News-Telugu Tollywood Photo Image

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం దాన్ని గవర్నర్‌కు పంపగా, వెంటనే ఆయన ఆమోద ముద్ర వేశారు.దీంతో జగన్ సర్కారు వెంటనే ఆర్డినెన్స్‌పై జీవో జారీ చేసి ఎన్నికల కమిషనర్ విధుల నుంచి రమేశ్ కుమార్‌ను తప్పించింది.

ప్రభుత్వానికి సంక్రమించిన అధికారంతో ఎన్నికల కమిషనర్‌గా రమేశ్ కుమార్‌‌ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.అయితే ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఇలాంటి సమయంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారు.ఎన్నికల కమిషనర్ ని తొలగించే విచక్షణా అధికారాలు జగన్ ని లేవని అంటున్నారు.

ఇలాంటి సమయంలో కూడా జగన్ రాజకీయాలు చేయడం దారుణమని ఎద్దేవా చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Andhra Pradesh Govt Issues Ordinance To Expel Sec Related Telugu News,Photos/Pics,Images..