ఏపీలో పొత్తు రాజకీయాలకు జోరుగా ఊహాగానాలు..

ఏపీ లో ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉంది.అయితే చంద్రబాబు ముందుగానే పొత్తు రాజకీయాలకు తెరదీశారు.

 Ap Politics Roaming Around Alliance,chandrababu,pawan Kalyan,bjp,somu Veerraju,-TeluguStop.com

దీంతో పలు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.గత అనుభవంతో చంద్రబాబు ఈ సారి పొత్తులతోనే ఎన్నికలను ఎదుర్కొవాలనుకుంటున్నారు.

బీజేపీ తో బాబు పొత్తుకు ప్రయత్నిస్తున్నారు ? కానీ ఆ పార్టీ టీడీపీ తో పొత్తుకు సుముఖంగా లేదంటున్నారు? ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను అయినా తమవైపు తిప్పుకోవాలని ట్రై చేస్తున్నారు ? ఆయన తేల్చి చెప్పడం లేదు.ఈ నేపథ్యంలో  బాబు దారెటు ?బీజేపీ తోనా ? కాంగ్రెస్ తోనా ? కాంగ్రెస్ తో పొత్తుకు ప్రజల స్పందన ఎలా ఉంటుంది ?

ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజ‌కీయం జోరుగా న‌డుస్తోంది.రెండు ప్ర‌దాన పార్టీలు ఇప్ప‌టికే జ‌న‌సేన వైపు చూస్తున్నాయి.టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌వ‌న్ కు డైరెక్ట్ ఆఫ‌ర్స్ ఇస్తుంటే మ‌రోవైపు బీజేపీ ఇప్ప‌టికే ప‌వ‌న్ మాతో ఉన్నాడని, జనసేనతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెబుతోంది.

అయితే ఏడాది క్రితం నుంచే చంద్ర‌బాబు ప‌వ‌న్ తో పొత్తు కోసం త‌హాత‌హాలాడుతున్నారు.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Somu Veerraju, Ys Jagan-Politica

అయితే తాజాగా క‌ర్నూలు టూర్ లో మళ్లీ పొత్తుల గురించి మాట్లాడిన ప‌వ‌న్ ఈసారి కూడా అవే వ్యాఖ్య‌లు చేశారు.అన్ని బ‌ల‌మైన పార్టీలో క‌లిసి రావాల‌ని మళ్లీ ప్రభుత్వ వ్య‌తిరేక ఓటు చీలితే జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తాడ‌ని అది జ‌రిగితే రాష్ట్రానికి తీరని న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.దీనికి రెండు రోజుల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, ప‌వ‌న్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా అందరూ కలిసివస్తే తాను ఏ త్యాగానికైన సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించారు.

అయితే ఇక్క‌డ ప‌వ‌న్ ప‌దే ప‌దే అన్ని బ‌ల‌మైన పార్టీలు క‌లిసిరావాల‌ని వ్యాఖ్య‌లు చేస్తోన్న‌ప్ప‌టికీ అన్ని బ‌ల‌మైన పార్టీలు క‌లిసి వ‌స్తే ప‌వ‌న్ క‌లిసి న‌డ‌వ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు ఎక్క‌డ చెప్ప‌డం లేదు.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Somu Veerraju, Ys Jagan-Politica

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పొత్తుల కుంపటి రాజుకుంది.మొన్నామధ్య ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా వైసీపీ ని గద్దె దించాలంటే అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని, అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమంటూ చంద్రబాబు పొత్తు ఆలపించడం దరిమిలా రాష్ట్రంలో పొత్తు రాజకీయాలు తెరపైకి వచ్చాయి.ఈ క్రమంలోనే బాబు మాటలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ఆ త్యాగాలు ఏపాటివో తెలుసంటూ చంద్రబాబును ఎద్దేవా చేయడంతో పొత్తు రాజకీయాలు కాస్తా వేడెక్కెయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube