జగన్ దే హవా..ఊహించని రిజల్ట్స్..జాతీయ సర్వే

ఏపీలో ఊహించని స్థాయిలో మార్పులు రానున్నాయా.? ఎన్నికల్లో వైసీపి పార్టీ తన సత్తా చాట నుందా.? ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే వైసీపికి రికార్డు స్థాయిలో గెలుపు ఇవ్వడానికి ఏపీ ప్రజలు సిద్దంగా ఉన్నారా అంటే అవుననే అంటోంది తాజాగా జరిగిన జాతీయ స్థాయి సర్వే.అంతేకాదు టిడిపి పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని.

 Ap Politics – National Survey Shocking Report-TeluguStop.com

వైసీపి కి ఊహించని స్థాయిలో విజయం అందబోతుందని చెప్తోంది ఈ సర్వే.దేశవ్యాప్తంగా జ‌మిలీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం భావిస్తున్న త‌రుణంలో పార్టీల‌న్నీ ఇప్ప‌టినుంచే తమ వ్యుహాలకి పదును పెట్టేశాయి.

పెంచేశాయి.జ‌మిలీ ఎన్నిక‌లు జ‌రిగితే ఈ ఏడాది చివ‌ర్లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు రానున్నాయి.

లేనిప‌క్షంలో వ‌చ్చే ఏడాది ఏప్రిల్,మే మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గి అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీల భవితవ్యం ఎలా ఉంటుంది అనే విషయంపై జాతీయ స్థాయిలో జరుగుతున్నస‌ర్వేలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉన్న‌వాటితో పాటు ప్రాంతీయ పార్టీల‌పై కూడా కొన్ని ప్రైవేట్ సంస్థ‌లు క‌న్నేశాయి.వీటితో పాటు జాతీయ మీడియా సంస్థ‌లు కూడా ఈ స‌ర్వేల‌పై ఫోక‌స్ పెడ్తున్నాయి.

ఏయే రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హ‌వా ఉంది,ఏ పార్టీలు అధికారంలోకి వ‌స్తాయి, లోక్ స‌భ స్థానాలు ఎన్ని గెలుచుకోగ‌ల‌రు, ముఖ్యంగా యూపీఏ,ఎన్డీయే మిత్ర ప‌క్షాల ప‌ట్టు ఎలా ఉంది….ఇలా అనేక విష‌యాల‌పై స‌మ‌గ్రంగా స‌ర్వే జరుగుతోంది.

ఇందులో భాగంగానే ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రం పై కూడా ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు స‌ర్వేలు జ‌రిపాయి.

అయితే తాజాగా పేరుమోసిన జాతీయ ఛానెల్ ఒక‌టి ఏపీపై స‌ర్వే రిపోర్ట్ రిజల్స్ ని బయటపెట్టింది… ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న చంద్ర‌బాబు స‌ర్కారు నూకలు చేల్లిపోయాయని ఈ సారి ఎట్టిప‌రిస్థితుల్లోనూ టిడిపి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అంటున్నాయి.

చంద్ర‌బాబు ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం ఎన్డీయేన‌ని, ఆయ‌న గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఇటు ఎన్డీయేతో,అటు జ‌న‌సేన తో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే అధికారంలోకి వ‌చ్చార‌ని,కానీ 2019 లో మాత్రం ఆ పరిస్థితి లేద‌ని అంటున్నాయి.మరో వైపు నాలుగేళ్ళుగా ప్రత్యేక హోదా పై మాట్లాడని చంద్రబాబు ఇప్పుడు అవిశ్వాసం అంటూ డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు ఈ విషయాన్ని సున్నితంగా తీసుకోలేదని.

సర్వేలో ప్రతీ ఒక్కరు అడిగిన ప్రశ్న ఇదే అంటూ వెల్లడించింది.

ఇదిలాఉంటే ఒకప్పుడు పవన్ దోస్తీ ఎలా అయితే కలిసోచ్చిందో అలాగే ఈ సారి పవన్ ఒంటరిగా పోటీ చేయడం.

చంద్రబాబు ని విభేదించడం వలన అధికార టీడీపీ ఓట్ల‌న్నీ చీలుతాయ‌ని,త‌ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంద‌ని, ఖ‌చ్ఛితంగా, ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసినా 2019 లో మాత్రం వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని.ఈ సర్వే తెలిపింది.

ఈ సర్వే రిజల్ట్స్ చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ ఆశలపై నీళ్ళు చల్లినట్లుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు…అయితే ఇందులో మరొక ట్విస్ట్ ఏమిటంటే జగన్ మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా 20 సీట్లు అధికంగా గెలుస్తాడని ఈ సర్వే అంచనా వేస్తోంది.ప్రశాంత్ కిషోర్ పన్నుతున్న వ్యూహాలు అమలు జరుగుతోందని తప్పకుండా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని వైసీపి కార్యకర్తలు నేతలు ఫుల్ కుషీ అవుతున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube