“ఏపీలో పొలిటికల్ డ్రామా”..బాహుబలి ని మించిన సస్పన్స్       2018-05-09   07:10:37  IST  Bhanu C

నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకూ నాకు లైఫ్ ఇచ్చిన పార్టీని వీడే సమస్యే లేదు..ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే నా పార్టీ అధినేత అడుగులో అడుగు వేస్తాను అని డాంబికాలు పలికే వాళ్ళందరూ చెప్పిన మాటలు మర్చి పోయి పక్క పార్టీ లోకి జంప్ చేసే సమయం ఆసన్నమయ్యింది.. మరో పక్క ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకీ హైప్స్ కి చేరుతోంది..ఒక పక్క బీజేపి నుంచీ వైసీపి లోకి వలసలు బీజేపి నుంచీ వైసీపి, టీడీపి లోకి జంపింగ్ నేతలు జంప్ చేస్తూనే ఉన్నారు..చివరి నిమిషం వరకూ వేచి చూసే ధోరణిలో మాత్రం నేతలు ఉండలేక పక్క పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని మారీ పార్టీలు మారిపోతున్నారు..

అయితే ఈ క్రమంలోనే మా పార్టీలో నేతలు అస్సలు మారే అవకాసం లేదని మీడియా సాక్షిగా ప్రకటించిన మరుసటి రోజునే ఎంతో కీలకంగా ఉన్న నేతలు జంప్ అయిపోతున్నారు ఈ పరిస్థితి ఇప్పుడు అధికార టీడీపిలో ఎక్కువగా కనిపిస్తోంది..ఈ క్రమంలోనే టీడీపీ నేతలు తట్టా బుట్టా సర్దుకుంటున్నారు..వీరిలో విజయవాడ తూర్పు కి చెందినా యలమంచిలి రవి..ఈయన తూర్పు నియోజకవర్గంలో ఎంతో ప్రభావితం చేయగల నేత అయితే ఆ నియోజక వర్గాన్ని రామమోహనరావు కి ఇవ్వడంతో నొచ్చుకున్న రవి వచ్చే ఎన్నికలలో టిక్కెట్టు కోసం ముందుగానే ప్లాన్ చేసుకుని మరీ వైసీపి జెండా కప్పుకున్నారు..

బీజేపి నుంచీ వైసీపి లోకి కన్నా చేరిక లాంచనం అయినా చివరి నిమిషంలో ఆగింది అయితే త్వరలోనే ఆయన చేరిక కూడా ఉంటుందని తెలుస్తోంది..ఇక వైజాక్ కి చెందిన బీజేపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ సైతం వైసీపి తీర్ధం పుచుకున్నారు. ఇదిలాఉంటే కర్నూల్ జిల్లా బీజేపి సీనియర్ నేత రాం భూపాల్ రెడ్డి సైతం జగన్ పంచన చేరిపోయారు..మరో బీజేపి నేత చిత్తూరుకి చెందిన కారుమంచి సైతం టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు..ఇదిలాఉంటే మాజీ మంత్రి గుంటూరు కి చెందిన రావేల సైతం వైసీపి లోకి వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది..

ఇవన్నీ పక్కన పెడితే కమ్మ వర్గం నేతలు ఎక్కువగా ఉన్న గుంటూరు, కృష్ణా నుంచీ భారీ వలసలు ఉంటాయని వైసీపి సీనియర్స్ చెపుతున్నారు..అందులో భాగంగానే..మైలవరం సీటు కోసం ఎదురు చూస్తున్న టీడీపీ కి చెందిన సీనియర్ నేత వసంత కృష్ణ సైతం త్వరలోనే వైసీపిలోకి వెళ్లనున్నారు..అయితే ఇక్కడ అసలు సిసలు సస్పెన్స్ ఏమిటంటే..కేవలం ఈ రెండు జిల్లాల నుంచీ కీలక నేతలు త్వరలో జగన్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది…ఈ చేరికలు తరువాత నియోజక వర్గాల వారీగా నేతల చేరికలు భారీగా ఉంటాయని అందుకు తగ్గట్లుగా ప్రణాలికలు సైతం సిద్దం అయ్యాయని అంటున్నారు వైసీపి సీనియర్స్ అయితే కీలక నేతలు అంటున్నారు తప్ప ఆ నేతల వివరాలు చాలా గోప్యంగా ఉంటున్నాయని ఎందుకని అడిగితే..సదరు నేతలు టీడీపీ ని విడిచి బయటకి వచ్చేటప్పుడు చంద్రబాబు షాక్ అవ్వాలి కదా అందుకే అంటున్నారట..మరి ఎవరా నేతలు ఏమిటా కధ తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే అంటున్నారు వైసీపి సీనియర్స్.