జనసేనాని కింగ్ మేకర్ అవబోతున్నాడా! హంగ్ వచ్చే అవకాశం ఎంత  

ఏపీ పొలిటికల్ చిత్రంలో కింగ్ మేకర్ కి అవకాశం లేదు అంటున్న విశ్లేషకులు. .

Ap Political Scenario To Win One Party-janasena,tdp,win One Party,ysrcp

 • ఏపీ రాజకీయాలలో మూడు పార్టీల రసవత్తర పోరు తర్వాత ప్రజలు తమ ఓటు హక్కుని భారీగా వినియోగించుకున్నారు. ఏపీ రాజకీయాలలో ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ప్రజలు అధిక సంఖ్యలో తమ ఓటు వేయడం కోసం ప్రాధాన్యత ఇచ్చారు.

 • జనసేనాని కింగ్ మేకర్ అవబోతున్నాడా! హంగ్ వచ్చే అవకాశం ఎంత-AP Political Scenario To Win One Party

 • కొన్ని జిల్లాలో పోలింగ్ 70 శాతంకి పైగా నమోదు అయ్యింది అంటే ప్రజలు ఏ స్థాయిలో ఎలక్షన్స్ లో తమ ఓటుతో సమాధానం చెప్పడానికి ఎదురు చూసారు అనేది స్పష్టం అవుతుంది.

  AP Political Scenario To Win One Party-Janasena Tdp Win Party Ysrcp

  ఇక ఎన్నికలలో పోలింగ్ పూర్తయ్యింది. అయితే ప్రస్తుతం బలంగా పోటీ పడుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికీ వారు తమదే ఆధిక్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని టీడీపీ అంటూ ఉంటే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటూ వైసీపీ చెబుతుంది.

 • కాదు ఈ సారి తమ పార్టీ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు అబుతుంది అని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.

  AP Political Scenario To Win One Party-Janasena Tdp Win Party Ysrcp

  అయితే ఈ సారి పోలింగ్ ప్రక్రియ చూస్తూ ఉంటే అధికారం ఏదో ఒక పార్టీకి ఏకపక్షంగా ఉంటుంది తప్ప హంగ్ వచ్చే అవకాశాలు లెవ్వని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మార్పు కోరుకుంటే వైసీపీ, సంక్షేమం అంటే టీడీపీకి అధికారం వస్తుంది.

 • అయితే మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన ఒక బలమైన శక్తిగా, ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన ఫ్యాక్టర్ గట్టిగా పని చేసిన సీట్లు భాగానే వచ్చిన కూడా కింగ్ మేకర్ గా నిలబడే అవకాశం ఉండదని భావన రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.