మీరే మా బలం ! మీడియా మద్దతు కోసం పార్టీల జిమ్మిక్కులు

తాము ఏమి చేసాం ? ఇంకా ఏం చేయబోతున్నాం ? మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకా ఏమేమి చేస్తాం అని విషయాలను ప్రజలకు తెలిసేలా చేయాలంటే రాజకీయ పార్టీలకు మీడియా అవసరం ఎంతైనా ఉంది.నాయకులు చెప్పింది ప్రజలకు క్షణాల్లో చేరాలంటే మీడియానే ప్రధాన ఆయుధం.

 Ap Political Parties Whats Media Support For This Elections-TeluguStop.com

సోషల్ మీడియా ప్రభావం ఎంత పెరిగినా ఇంకా గ్రామస్థాయిలో జనాలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మీదే ఆధారపడి రాజకీయాలను అంచనా వేసే పరిస్థితి ఉంది.ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా సహకారం లేకుండా ఏ రాజకీయ పార్టీ ప్రజల్లో మద్దతు కూడా కట్టలేని పరిస్థితి.

ఈ విషయాన్ని ఏపీ అధికార పార్టీ టిడిపి ఎప్పుడు గ్రహించింది.అందుకే మొదటి నుంచి మీడియాతో సఖ్యత గా ఉంటూ తమ రాజకీయ అవసరాల కోసం వారిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళుతుంది.

వైసీపీ విషయానికి వస్తే వారికి కూడా సొంతంగా మీడియా ఉన్నా టీడీపీకి సపోర్ట్ చేసే ఛానెల్స్ సంఖ్య ఎక్కువ ఉండడంతో యెల్లో మీడియా అంటూ వైసీపీ కొన్ని మీడియా సంస్థలను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది.కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన కూడా సొంతంగా ఓ ఛానెల్ ను నిర్వహిస్తోంది.ఇప్పటివరకు ఫలానా మీడియా ఫలానా పార్టీకి అనుకూలం అంటూ దుమ్మెత్తి పోసిన రాజకీయ పార్టీల స్వరం అకస్మాత్తుగా మారిపోయింది.నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత జగన్.

కొన్ని మీడి యా సంస్థల విషయంలో కొంత అసహనంతో ఉన్న విషయం తెలిసిందే.అయితే, ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పచ్చ మీడియా అంటూ తాను ఎత్తిచూపే మీడియా సంస్థలను కూడా దగ్గర చేసుకుని అనుకూల వాతావరణం సృష్టించుకుని పనిలో పడ్డాడు.

తాడేపల్లి లో జగన్ కొత్త ఇల్లు గృహప్రవేశం సందర్భంగా పచ్చ మీడియాగా తాను ముద్ర వేసిన వారిని పక్కనే కూర్చోబెట్టుకుని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసారు.వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎవరితో ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు కదా అందుకే ముందు చూపుతో జగన్ ఆ విధంగా వ్యవహ రిస్తున్నారు.ఇక టీడీపీ మీడియా కు మరింత దగ్గర అయ్యేందుకు వారికి భారీ భారీ యాడ్స్ ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.ఎన్నికల సమయంలో తమపై వ్యతిరేక వార్తలు రాయకుండా చూసుకునేందుకు చంద్రబాబు ముందుగానే బాబు ఈ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇక జనసేన విషయంలో మీడియా కొంచెం మొఖం చాటేసినట్టే కనిపిస్తోంది.మొదట్లో జనసేనను ఆకాశానికి ఎత్తిసిన కొన్ని ఛానెల్స్ ఇప్పుడు మొఖం చాటేస్తున్నాయి.మీడియా సపోర్ట్ లేకపోతే మనుగడ కష్టమని భావిస్తున్న పవన్ వారికి దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube