ఏపీలో మూడు పార్టీలకి ఈ ఎన్నికలు కీలకమే! ఎలా అంటే  

ఈ ఎన్నికలు మూడు పార్టీలకి కీలకం. .

Ap Political Parties Want Win In This Election-

ఏపీలో ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన.ఈ మూడు పార్టీలకి ప్రస్తుతం జరిగే సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి.ఈ ఎన్నికలలో గెలుపు ఓటములు పార్టీల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అంటే కాస్తా ఆలోచించాల్సిన విషయమే అయిన అదే వాస్తవం.

Ap Political Parties Want Win In This Election--AP Political Parties Want Win In This Election-

ఈ ఎన్నికలలో పార్టీ బలాబలాలు, గెలుపు స్థానాలు భవిష్యత్తులో ఆయా పార్టీలు ఎంత వరకు రాజకీయ ఉనికిని చాతుకోగాలవు అనేది నిర్ణయిస్తాయి.

ముందుగా వైసీపీ తీసుకుంటే, ఈ ఎన్నికలు ఆ పార్టీకి చాలా కీలకం అని చెప్పాలి.

పార్టీ పెట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది.ఒక ప్రాంతీయ పార్టీని బలంగా నడపాలంటే కచ్చితంగా ఒకసారైన అధికారంలోకి రావాలి.అయితే వైసీపీ ఆ అవకాశాన్ని గత ఎన్నికలలో కొద్ది తేడాతో మిస్ చేసుకుంది.అయిన కూడా జగన్ నమ్మకంతో పార్టీని నడుపుతున్నాడు.ఇక ఈ సారి ఎన్నికలలో గెలవకుంటే పార్టీ భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది.

రాజకీయ నాయకులు ఎప్పుడు ఎక్కువ కాలం అధికారం లేకుండా ఉండలేరు.

ఇక టీడీపీ విషయానికి వస్తే, ఈ ఎన్నికలలో గెలిస్తే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు కొనసాగుతారు.ఇక పార్టీకి ప్రధాన అండ చంద్రబాబు.ఒక వేళ పార్టీ ఓడిపోతే చంద్రబాబు తర్వాత పార్టీని దీర్ఘకాలం నడిపించే సత్తా ఉన్న నాయకుడు కనుచూపు మేరలో ఎవరు కనిపించడం లేదు.లోకేష్ సత్త టీడీపీ క్యాడర్ అందరికి తెలిసిందే.ఇక తారక్ వస్తాడని ఆశిస్తున్న అది ఎంత వరకు జరుగుతుంది అనేది చెప్పలేని పరిస్థితి.

ఇక జనసేన పార్టీ సింగిల్ ఎజెండా పవన్ కళ్యాణ్ అనే అండతోనే నడుస్తుంది.ఇక సుదీర్ఘ కాలం రాజకీయాలు చేయడానికి వచ్చాను అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ప్రభావం చూపించి అధికారం తెచ్చుకోలేకపోయిన కూడా కనీసం బలం నిరూపించుకునే స్థాయిలో సీట్లు కచ్చితంగా సొంతం చేసుకోవాలి.అలా అయితే ప్రతిపక్ష పాత్ర పోషించి అతను అనుకున్న సుదీర్ఘ రాజకీయం చేయడానికి కుదురుతుంది.

అలా కాకుండా సింగిల్ డిజిట్ కే పరిమితం అయితే పార్టీలు ఉన్న నేతలు కండువాలు మార్చేసే అవకాశం ఉంది.