ఏపీలో ఒంటరిపోరు తప్పదా ..? అన్ని పార్టీల పరిస్థితి ఇంతేనా ...?

ఏపీలో ఎన్నికల సమయం ముంచుకువచ్చేస్తోంది.సమయం దగ్గరపడే కొద్దీ … అన్ని పార్టీల్లోనూ… టెన్షన్ పెరిగిపోతోంది.

 Ap Political Parties Going To Single In To The People In 2019-TeluguStop.com

ఈ దశలో ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో పడిపోయాయి అన్ని పార్టీలు.చెప్పుకోవడానికి ఏపీలో చాలా పార్టీలే ఉన్నా…ప్రధాన పోటీ అంతా… మూడు పార్టీల మధ్యే ఉంటుంది అన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే….ఇందులో వైసీపీ… టీడీపీ …జనసేన పార్టీలు ప్రధానంగా తలపడనున్నాయి.ఈ అన్ని పార్టీలకు… అధికారం దక్కడం అనేది అత్యవసరం.ఎందుకంటే…ఇప్పుడు రేసులో ఎవరు వెనుకపడ్డా … మళ్ళీ కోలుకోవడం చాలా కసతం అనే సంగతి అందరికి తెలుసు.ఈ సమయంలో పొత్తుల అంశం తెర మీదకు వచ్చింది.గత ఎన్నికల్లో… టీడీపీకి జనసేన పార్టీ మద్దతు పలికి అధికారం దక్కడానికి కారణం అయ్యింది.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.జనసేన తొలిసారిగా ఇప్పుడు ఎన్నికల బరిలోకి దూకేందుకు సిద్ధం అవుతోంది.

ఈ దశలో టీడీపీ ప్రత్యేకహోదా కోసం.అంటూ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మేలుగుతోంది.అయితే అది జాతీయ స్థాయిలో మాత్రమే.కూటమిగా తెలంగాణలో పోటీచేసినా ఫలితం మాత్రం బోర్లా పడింది.అక్కడ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చి ఉండి ఉంటే.పరిస్థితులు ఎలా ఉండేవో కానీ.

ఇప్పుడు మాత్రం.కాంగ్రెస్ పార్టీతో ఏపీలో సీట్ల సర్దుబాటు లేదా పొత్తు అనేది సెట్ అయ్యేలా కనిపించడంలేదు.

చంద్రబాబు కూడా.ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని విమర్శలపాలవడం తప్ప పెద్దగా టీడీపీకి కలిసొచ్చే అంశాలేవీ లేవనే ఆలోచనలో ఉన్నాడు.

దాదాపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దూకేందుకు సిద్ధం అవుతోంది.సరిగా ఇదే ఆలోచనలో కాంగ్రెస్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది.

దీనిలో భాగంగానే… ఏపీ కాంగ్రెస్ నేతలు అందరినీ… నెలాఖరులో ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ ఆహ్వానించారు.అలాగే ఇదే విషయం పై … ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి.

జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే….ఆ పార్టీ ముందు నుంచీ తమది ఒంటరి పోరే అంటూ … చెప్పుకొస్తోంది.కొద్దీ రోజుల క్రితం వైసీపీ – జనసేన పార్టీలు కలిసికట్టుగా… ఎన్నికల బరిలోకి వెళ్లాలని చూస్తున్నాయి అంటూ… వార్తలు కూడా వినిపించాయి.అయితే….అదంతా తూచ్ అంటూ… రెండు పార్టీల అధినేతలు కూడా కొట్టిపారేశారు.

దీంతో ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీది ఒంటరిపోరే అన్న సంగతి అందరికి అర్ధం అయిపొయింది.పోనీ జాతీయ అధికార పార్టీతో కలిసి ముందుకు వెల్దామంటే… ఆ పార్టీకి ఇక్కడ పెద్ద బలం లేకపోవడం.

అలాగే ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి ఆ పార్టీ అన్యాయం చేసింది అని ప్రజలు ఆగ్రహంగా ఉండడం….వంటివి ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళలేని పరిస్థితి.పోనీ… వామపక్ష పార్టీలతో కలిసి జగన్ ముందుకు వెళ్తారా అంటే… వారు టీడీపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతారని జగన్ కు భయం.అలాగే వామపక్ష పార్టీలు ప్రస్తుతం జనసేన పార్టీతో కలసి ముందుకు వెళ్తామని చెబుతున్నా… జనసేన నుంచి పెద్ద రెస్పాన్స్ రావడంలేదు.దీనికి తోడు జనసేన ఎవరితోనూ… పొత్తు పెట్టుకోడు ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్తుంది అంది పవన్ ప్రకటించేశాడు కూడా.ఇటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు దాదాపు సిద్ధం అయిపోయినట్టుగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube