పార్టీలు మారేందుకు ఏపీ నాయకులు వెయిటింగ్ !

ఏపీలో ఇప్పుడు రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది .ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది.? అనే ఊహాగానాలు… అంచనాలు ఎన్నో చూస్తూనే ఉన్నాము.ఇక పార్టీలోకి వలసల సంగతి కూడా ఈ విధంగానే ఉంది.

 Ap Political Leaders Wants To Jump Parties-TeluguStop.com

ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న సందర్భంగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి … ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంపింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.కాకపోతే మొన్నటివరకు తెలంగాణాలో ఎన్నికల హడావుడి ఉండడంతో.

ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడి నాయకుల వలసలు తగ్గాయి.తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు చూసి అనంతరం పార్టీ మారితే బాగుంటుంది అనే ఆలోచనలో చాలామంది నాయకులు ఉండిపోయారు.

ఖచ్చితంగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ లోకి వెళ్తారు అనే టాక్ తెచ్చుకున్న నేతలు సైతం ఇప్పడు తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో అటు ఇటు అని జంప్ చేయాలనే ఆలోచన ఉన్న నాయకులు పెరుగుతున్నారు.ఇలాంటి వారు అటు వైసీపీలోను, ఇటు టీడీపీలోనూ ఉన్నారు.మరికొందరు కాంగ్రెస్‌లో కూడా ఉన్నారు.

ప్రధానంగా కాంగ్రెస్‌-టీడీపీల బంధాన్ని వ్యతిరేకిస్తున్న నాయకులు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు.వీరిలో కేవీపీ రామచంద్రరావు పేరు ఇటీవల కాలంలో బాగా వినిపిస్తోంది.

అదేవిదంగా ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వట్టి వసంత కుమార్ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి, ఉత్తరాంధ్రకు చెందిన కొణతాల రామకృష్ణ, గుంటూరుకు చెందిన మరో టీడీపీ నాయకుడు.

ఇలా పది మంది వరకు కీలక నాయకులు పార్టీలు మారాలని నిర్ణయించుకున్నారు.

అయితే వీరంతా తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి ఆ తరువాత పార్టీ మారే విషయంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలోని సిట్టింగుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న దాదాపు 40 మందిని చంద్రబాబు పక్కనపెట్టే అవకాశం కనిపిస్తోంది.ఈ కారణంగానే పార్టీలు మారాలని చూస్తున్న వారు ఈ నెల 11 వరకు వెయిట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 11న తెలంగాణా ఎన్నికల లెక్కింపు, ఫలితం వెంట వెంటనే రానున్నాయి.

దీంతో ఎవరు గెలుస్తారు? ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో తెలుస్తుంది.దీన్ని బట్టి ఏపీలో నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.అప్పుడే ఏపీలో రాజకీయ వలసలు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube