లగడపాటి అంచనాలతో ఏపీలో మారిన రాజకీయ ఈక్వేషన్స్  

ఏపీలో లగడపాటి సర్వే తర్వాత మారిన పొలిటికల్ బెట్టింగ్స్. .

Ap Political Equations Completely Change-

ఏపీలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ సర్వే అంటే రాజకీయాలలో ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంటుంది.లగడపాటి సర్వే చెప్పాడంటే కచ్చితంగా అది జరుగుతుంది అనే మాట చాలా మంది బలంగా విశ్వసిస్తారు.అయితే తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికలలో లగడపాటి సర్వే ఫలితాలు పూర్తిగా తారు మారు అయ్యాయి..

Ap Political Equations Completely Change--AP Political Equations Completely Change-

తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెబితే దానికి విరుద్ధంగా టీఆర్ఎస్ భారీ ఆధిక్యంతో విజయ దుంధుబి మోగించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.మరో ఐదు రోజులలో ఏపీకి తరువాత రాజు ఎవరనే విషయం తెలిసిపోతుంది.

అయితే ఫలితాలకి ముందు ఎగ్జిట్ పోల్స్ దేశ వ్యాప్తంగా ఆసక్తి పెంచేందుకు సిద్ధం అయ్యాయి.ఈ రోజు చాలా మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ని ప్రకటించడానికి సిద్ధం అయ్యారు మరో వైపు ఏపీ ఆక్టోపస్ రాజగోపాల్ కూడా మీడియా ముందుకొచ్చి తన సర్వే రిజల్ట్ చెప్పడానికి సిద్ధం అయ్యారు.దీనికి సంబంధించి ఇప్పటికే చూచాయగా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి సంచలనం రేపాడు.

ఇప్పటి వరకు ఏపీలో ఈ సారి వైసీపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావిస్తున్నారు.దానికి తగ్గట్లుగానే పొలిటికల్ బెట్టింగ్స్ ఉన్నాయి.అయితే ఈ లగడపాటి సర్వేతో మరల పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి అనే టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ ఫలితాలు ఎంత వరకు నిజం అవుతాయి అనేది ఇప్పుడు సందేహంగా ఉంది అని చెప్పాలి.