కోనసీమ లో పరిస్థితి చక్కబడినట్టేనా ?

కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం పై మొదలైన వివాదం చివరకు మంత్రి విశ్వరూప్ , ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి దహనంతో పాటు, కోనసీమ ప్రాంతంలో అశాంతి వాతావరణం నెలకొనడానికి కారణమైంది.ఇందులో వివిధ రాజకీయ పార్టీల వైఖరి కూడా ఈ వ్యవహారానికి ప్రధాన కారణం.

 Ap Police Increased Security For Political Leaders Homes In Konaseema District Details, Konaseema, Amalapuram, Pinipe Viswaroop, Mla Ponnada Sathish, Ambetkar Konaseema Dristict, Jagan, Tdp, Janasena, , Rapaka Varaprasad, Chirla Jaggireddy, Kondeti Chittibabu-TeluguStop.com

కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలు కాస్త ఉద్రిక్తత పెంచడానికి కారణమయ్యాయి.మంత్రి, ఎమ్మెల్యే ఇంటి దహనం తరవాత పోలీసులు పూర్తిగా కోనసీమ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.ఐపిఎస్ అధికారులను ప్రాంతాలవారీగా ఇంచార్జిలుగా నియమించారు.

 Ap Police Increased Security For Political Leaders Homes In Konaseema District Details, Konaseema, Amalapuram, Pinipe Viswaroop, Mla Ponnada Sathish, Ambetkar Konaseema Dristict, Jagan, Tdp, Janasena, , Rapaka Varaprasad, Chirla Jaggireddy, Kondeti Chittibabu-కోనసీమ లో పరిస్థితి చక్కబడినట్టేనా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.ఇప్పటికే దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, 200 మంది వరకు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు గా తేల్చారు.

మరో వెయ్యి మంది వరకు ఉన్నట్లు తేలడంతో వారు ఎవరు అనే విషయాన్ని ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.ఈ ఘటన తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు.

పూర్తిగా ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేస్తున్నారు.కొత్త వారు ఎవరు కాకుండా చూస్తూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇక ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల నివాసాలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

Telugu Amalapuram, Chirla Jaggi, Jagan, Janasena, Konaseema, Mlaponnada-Political

అల్లవరం మండలం మగాళ్ళం ఊరిలో ఉంటున్న చింత అనురాధ, నగరంలో ఉంటున్న పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కత్తిమండ లో ఉంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు చెందిన ఇళ్లకు భద్రతను పెంచారు.అలాగే రావులపాలెం మండలం గోపాలపురం లో నివాసం ఉంటున్న ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి ఇంటికి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నివాసం వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.కోనసీమ ప్రాంతంలో ఎక్కడా అల్లర్లు, ఆందోళనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని రకాల వస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube