ఏపీలో ఎన్నికల బందోబస్తుకి కేంద్ర పారా మిలటరీ బలగాలు

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.ఈ నేపధ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టాయి.

 Ap Police Conduct Flag March To Advocate For Free And Fair Elections-TeluguStop.com

ఈ ఎన్నికలలో గెలుపు కోసం ఎవరికి వారే తమ రాజకీయ వ్యూహాలకి పదును పెట్టి ముందుకెళ్తున్నారు.మరో వైపు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది.

ఇదిలా ఉంటే ఎన్నికలు అంటే ఏపీ లో కొన్ని చోట్ల శాంతి భద్రతల సమస్యలు ఉంటాయి.రాయలసీమ ప్రాంతాలలో ఫ్యాక్షన్ గొడవల మధ్య రాజకీయాలు ఎప్పుడు హింసాత్మకంగా మారుతాయి.

ఈ నేపధ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం భద్రతా దళాలని రంగంలోకి దించింది.సిఆర్పీఎఫ్, పారా మిలటరీ బలగాలని రక్షణ కోసం ఉపయోగించుకుంటుంది.

శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అన్ని ప్రాంతాలకి ఇప్పటికే బలగాలని తరలించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం భద్రతా దళాలు గ్రామాలలో ఇప్పుడు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ప్రజలని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube