జగన్ పై వ్యతిరేకత ఈ రేంజ్ లో ఉందా ?

ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి ఇప్పటికి ఇంకా సంవత్సరం పూర్తి కాకముందే జగన్ పరిపాలన పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రి గా చేసిన బాబు కానీ, ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా చేపట్టిన వారు ఎవరు జగన్ చేపట్టిన స్థాయిలలో ఇంత స్వల్ప కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టలేదనే చెప్పుకోవాలి.

 Ap Peoples Disagreements Over Jagan Administrations-TeluguStop.com

జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, అసాధ్యం అనుకున్న పథకాలను కూడా ప్రవేశపెట్టి ప్రజల్లో తన చిత్తశుద్ధిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు.పాదయాత్రలో తాను చుసిన, విన్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా నవరత్నాలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏపీలో అభివృద్ధి పనులు చేస్తున్నాడు.

ఇంతవరకు బాగానే ఉన్నా… జగన్ పరిపాలన పై చాలా మంది పెదవి విరుస్తున్నారు.

Telugu Apcm, Ap, Ap Status, Chandrababu, Jagan-Political

మూడు.రాజధానుల విషయంలో జగన్ నిర్ణయాన్ని మెజారిటీ ప్రజలు ఆహ్వానిస్తున్నప్పటికి ఈ విషయంలో చాలామందికి అనేక సందేహాలు మిగిలిపోయాయి.ఇక పోలవరం ప్రాజెక్టు పైన ఇదే రకమైన చర్చ జరుగుతోంది.

ఇక ప్రత్యేక హోదా విషయంలో జగన్ అనుమానాస్పదంగా వ్యవహరించడం పైన జగన్ పై ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలం వరకు సర్దుబాట్లు ఉంటాయి అని తెలిసినా ప్రజల్లో మాత్రం ముందు లో ఉన్నంత సానుకూలత ఇప్పుడు జగన్ ప్రభుత్వం పై లేదన్నట్టుగా అనేక మార్గాల ద్వారా తెలుస్తోంది.

Telugu Apcm, Ap, Ap Status, Chandrababu, Jagan-Political

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో టిడిపి వేగంగా బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తోందది.ఈ ఎన్నికల్లో వైసీపీకి కనీసం 70 , 80 శాతం మెజార్టీ స్థానాలు కనుక సాధించకపోతే జగన్ పాలన పై ప్రజా వ్యతిరేకత ఉందనే అనుమానాలు మరింతగా బలపడతాయి.అందుకే అభివృద్ధి సంక్షేమ పథకాలు తో పాటు ప్రజలకు ఇంకా మెరుగైన పాలన అందించేందుకు ఏం చేయాలి అనే విషయాన్ని సర్వేల ద్వారా జగన్ తెలుసుకుని ఆ లోటు పాట్లను సర్దుకుపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.ఇప్పటికే ప్రభుత్వం చేయించుకున్న సర్వేల్లోనూ చాలా విషయాల్లో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే విషయం బయటపడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube