ఏపీ కాంగ్రెస్ కు ఆయనే 'దిక్కు' అయ్యాడా ?  

Ap Pcc Chief Sailajanath ?-congress Working President,sailajanath

ఏపీలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునర్వైభవం తీసుకు వచ్చి పరుగులు పెట్టించాలని కాంగ్రెస్ అధిష్టానం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది.అందుకే ఖాళీగా ఉన్న పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా కసరత్తు చేస్తూ వచ్చింది.

Ap Pcc Chief Sailajanath ?-congress Working President,sailajanath -AP PCC Chief Sailajanath ?-Congress Working President

దీనికోసం మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు, చింత మోహన్, సాకే శైలజానాథ్ ఇలా అనేక మంది పేర్లను పరిగణలోకి తీసుకుంది.చివరికి పార్టీ పగ్గాలను శైలజానాథ్ కు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

అంతకు ముందు వరకు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరా రెడ్డి రాజకీయాలకు పూర్తిగా విరామం ప్రకటించేసి తన సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు.ఆయన వైసిపి, బిజెపిలో చేరుతారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్ ను అధిష్టానం నియమించడంతో పాటు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా తులసి రెడ్డి, షేక్ మస్తాన్ వలీని నియమించింది.వీరి నియామకంతో పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని, వీరు మళ్లీ పార్టీకి ఫూనర్వైభవం తీసుకురాగలరు అని అధిష్ఠానం బలంగా నమ్ముతోంది.

గతంలో పదేళ్లపాటు అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నేడు ఈ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడానికి కారణం ఏపీ, తెలంగాణ విభజనే కారణం.విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీన పడిపోయింది.

ఏపీలో అయితే కనీసం ఒక అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది.ఆ తరువాత కాంగ్రెస్ ఉనికి ఎక్కడా లేకపోవడంతో రఘువీరా రెడ్డి తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు ఏ ఒక్క నాయకుడు ముందుకు రాలేదు.

ఇప్పుడు శైలజానాథ్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని అధిష్టానం ఆదేశించింది.అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సింగమల కు చెందిన శైలజానాథ్ వైఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో చీఫ్ విప్ గా పని చేశారు.

అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు.అయితే పార్టీకి ఫూనర్వైభవం తీసుకురాగల సత్తా శైలజనాథ్ కు ఉందా అనే అనుమానాలు అందులోనూ కలుగుతున్నాయి.

తాజా వార్తలు

Ap Pcc Chief Sailajanath ?-congress Working President,sailajanath Related....