తిరుపతి ఘటనపై నిరసనకు దిగిన ప్రతిపక్ష పార్టీలు.. !

గత రెండు రోజుల క్రితం తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కొవిడ్ రోగులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఈ ఘటన ఏపీలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది.

 Ap Opposition Parties Protesting Over Tirupati Ruya Hospital Incident-TeluguStop.com

అలాగే ప్రతిపక్షాలు కూడా ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి.అంతే కాకుండా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పలువురు టీడీపీ నేతలు రుయా ఆసుపత్రి వద్దకు వచ్చి ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించడంతో పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇక సీపీఐ చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొనబోతున్నారన్న సమాచారం తో నగరి వద్ద అడ్డుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు.ఇదే కాకుండా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు బీజేపీ ప్రతినిధి పీఎస్ రామారావు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆసుపత్రికి రాగా వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

 Ap Opposition Parties Protesting Over Tirupati Ruya Hospital Incident-తిరుపతి ఘటనపై నిరసనకు దిగిన ప్రతిపక్ష పార్టీలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా మొత్తానికి ఈ విషయంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతుందని సమాచారం.ఇకపోతే మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వాలని, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

#Oxygen #Incident #Narayana #Tirupati #TirupatiRuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు