ఏపీ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా మాజీ సీఎస్..!!

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న సంగతి తెలిసిందే.దీంతో కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు అన్నదానిపై ఉత్కంఠత ఉన్న క్రమంలో ఇటీవల గవర్నర్ దృష్టికి మాజీ సీఎస్ నీలం సాహ్ని, ప్రేమ్ చంద్ రెడ్డి, శామ్యూల్ పేర్లను ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేయడం జరిగింది.

 Ap New State Election Commissioner Ys Jagan,nimmagadda Ramesh Kumar,neelam Sahni-TeluguStop.com

ఈ నేపథ్యంలో తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ మాజీ సీఎస్ నీలం సాహ్ని ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం ని రిటైర్ అయిన వెంటనే ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఇటువంటి తరుణంలో ఆమెకు ఎస్ఈసీ పోస్ట్ రావటం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టించింది.ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియమితులయ్యారు.

ఇప్పుడు ఆయన ప్లేస్ లోకి జగన్ ప్రభుత్వం నీలం సాహ్ని ని నియమించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube