ఏపీలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడమే ఆలస్యం ఎన్నికలు?

ఏపీలో స్థానిక సంస్థల హడావుడి ఉన్న సమయంలో కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెల్సిందే.ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవ్వడంతో పాటు ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్‌ స్వీకరించడం కూడా పూర్తి అయ్యింది.

 Ap New Election Comissioner Kanagaraj In Press Meet About Election, Ap Corona Vi-TeluguStop.com

ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి అయిన సందర్బంగా మాజీ ఎన్నికల అధికారి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాడు.దాంతో ఏపీ ప్రభుత్వం ఆయనపై సీరియస్‌ అయ్యింది.

ఏకంగా ఆయన్ను తొలగించి కొత్త అధికారిని తీసుకు వచ్చింది.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఎన్నిక అయిన కనగరాజ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చు.

ప్రతి ఒక్కరు కూడా సిద్దంగా ఉండాలని సూచించాడు.రేపు ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను సడలిస్తూ నిర్ణయం తీసుకుంటే వారం పది రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తుందని, జగన్‌ కూడా అదే కోరుకుంటున్నాడు అంటూ సమాచారం అందుతోంది.మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నికలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.కరోనా వైరస్‌ జీరో కాకుండానే ఇలా ఎన్నికలకు వెళ్తే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube