ఎపీకి లో కొత్త జిల్లాలు..లిస్ట్ ఇదే     2017-12-11   22:08:16  IST  Bhanu C

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరువాత..కేసీఆర్ తెలంగాణాలో జిల్లాల సంఖ్యని పెంచారు 10 జిల్లాలని ఏకంగా 31 జిల్లాలుగా చేసేశారు..పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచీ కూడా మంచి స్పందన వచ్చింది.అయితే ఇప్పుడు ఇదే ప్రతిపాదన ఏపీలో కూడా ఉంది..తెలంగాణా కంటే కూడా ఏపీ పెద్దది అయితే ఏపీలో ఎప్పటినుంచో ఉన్న ఈ ప్రతిపాదనకి ఇప్పుడు సమయం వచ్చినట్టుగా కనిపిస్తోంది.

ఏపీ రాష్ట్రంలో జిల్లా సంఖ్యను పెంచనున్నారని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయినా ఆచరణలో మాత్రం ముందుకు కదలడం లేదు… ఈ మేరకు ఇప్పటికే వైఎస్ జగన్ కొత్త జిల్లాల ప్రణాళిక ప్రకటించేశాడు. తాము అధికారంలోకి వస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ప్రకటిస్తామన్నారు.అయితే ఈదే విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతోంది అని తెలుస్తోంది..అంతేకాదు పెంపు జిల్లాలతో కలిపి మొత్తం 24 కాబోతున్నాయి అని తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో వైసీపి అధినేత ముందు వరసలో ఉన్నారు..ఏకంగా కొత్త జిల్లాలకి ఇంచార్జ్ లని కూడా ప్రకటించేశారు..అయితే ఈ విషయంలో చంద్రబాబు కూడా పాలనా సౌలభ్యం కోసం ఏపీలో జిల్లాలని పెంచే ఆలోచన చేస్తున్నారట..జనవరి నాటికి ఈ జిల్లాలు ప్రకటన రావచ్చు అంటున్నారు..అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కొత్త జిల్లాలు ఇలా ఉంటాయి అని చెప్తున్నారు..అవేమిటో మీరు చుడండి.

1)అనంతపురం – అనంతపురం, హిందూపురం

2) నెల్లూరు-నెల్లూరు

3)కడప- కడప, పులివెందుల

4) కృష్ణా-కృష్ణా(విజయవాడ), మచిలీపట్నం

5) విజయనగరం-విజయనగరం, పార్వతీపురం

6) చిత్తూరు- చిత్తూరు, తిరుపతి

7)గుంటూరు-గుంటూరు, పొన్నూరు

8) కర్నూలు- కర్నూలు, నంద్యాల

9)పశ్చిమగోదావరి-పశ్చిమగోదావరి, ఏలూరు

10)తూర్పు గోదావరి-కాకినాడ, అమలాపురం

11) ప్రకాశం-ప్రకాశం(ఒంగోలు), కందుకూరు

12)శ్రీకాకుళం-శ్రీకాకుళం, పాలకొండ