అమిత్ షా చుట్టూ తిరుగుతున్న ఏపీ ఎంపీలు.. లాభం ఎవ‌రికో...?

ఏపీ రాజ‌కీయాలు ఎప్పుడైనా ఇక్క‌డి వ‌రకే ప‌రిమిత‌మ‌య్యాయి.ఏది జ‌రిగినా స‌రే ఇక్క‌డి నేతల మ‌ధ్య‌లోనే ఆ పంచాయితీ ఆగిపోయేది.

 Ap Mps Revolving Around Amit Shah  Profit Anyone  Ycp, Tdp , Ap Politics , Chand-TeluguStop.com

కానీ ఇప్పుడు ప‌రిధిదాటి పోయిన‌ట్టు క‌నిపిస్తోంది.త‌మ పంచాయితీని తీసుకెళ్లి బీజేపీ ముందు పెట్టేస్తున్నాయి ఇరు పార్టీలు కూడా.

మొన్న ప‌ట్టాభి రామ్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టి నుంచి ఏపీ రాజ‌కీయాలు అట్టుడికిపోతున్నాయి.ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే దాడులు జ‌ర‌గ‌డంతో దాన్ని కాస్తా చంద్ర‌బాబు అవ‌కాశంగా మార్చుకుని ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు.

ఏకంగా రాష్ట్ర‌ప‌తిని క‌లిసి ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాల‌ని కోరారు.

మ‌రి వైసీపీఊరుకుంటుందా వారు కూడా కేంద్ర‌మంత్రుల‌ను క‌లిసేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

అంతే కాదు ఈసీని కూడా క‌లిసి టీడీపీ గుర్తింపును ర‌ద్దు చేయాలంటూ రిక్వెస్టులు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.ఇక్క‌డే ఓ చిన్న కామ‌న్ పాయింట్ ఉంది.అదేంటంటే ఇరు పార్టీల ఎంపీలు ఇప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను క‌లిసేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.అమిత్ షాను ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాల‌ని ఇరు పార్టీల ఎంపీలు ఇప్ప‌టికే ఢిల్లీలో పోటీ పడుతున్నారు.

రాష్ట్రపతి పాలన నిన‌దాన్ని టీడీపీ ఎత్తుకుంటే టీడీపీ గుర్తింపును రద్దు నినాదాన్ని వైసీపీ ఎత్తుకుంది.

Telugu Amith Sha, Amith Shah, Ap, Chanda Babu, Mps, Ramandh Kovindh, Ys Jagan, Y

ఇలా ఎవ‌రికి వారే త‌మ నినాదాల‌తో ఢిల్లీ వేదిక‌గా పార్లమెంట్ హాల్ లో అమిత్ షాకు త‌మ ఫిర్యాదుల‌ను అంద జేసేందుకు బాగానే పోటీ ప‌డుతున్నారు.టీడీపీ త‌ర‌ఫున ఎంపీ కనకమేడల రవీంద్ర క‌లిసి వైసీపీ కార్య‌క‌ర్త‌లు త‌మ ఆఫీసుల మీద చేసిన దాడుల గురించి వివ‌రించ‌గా.అటు వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ రంగంలోకి దిగి టీడీపీ నేత‌లు చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌పై విన‌తి ప‌త్రం ఇచ్చారు.

ఇక క‌న‌క‌మేడ‌ల మాత్రం చంద్ర‌బాబుకు అపాయింట్మెంట్ అంశాన్ని తీసుకురాగా .అందుకు అమిత్ షా కూడా సానుకూలంగా ప్ర‌స్తావించారు.మ‌రి ఎవ‌రికి మ‌ద్ద‌తుగా నిలుస్తారో అన్న‌ది మాత్రం చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube