ఆన్ లైన్ టికెట్స్‌.. కోర్టు నిర్ణయం పై జగన్ సర్కారు స్పందన ఇదే

ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన ఆన్ లైన్‌ టికెట్ల విధానం కు కోర్టు స్టే విధించిన విషయం తెల్సిందే.థియేటర్ల ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా థియేటర్ల యాజమాన్యాలకు కాకుండా ప్రభుత్వం వద్దకు వెళ్తుంది.

 Ap Movie On Line Tickets Issue And Govt Reaction Details, Ap Govt, Movie Tickets-TeluguStop.com

ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలకు ఆ మొత్తం ను ఇవ్వాల్సి ఉంటుంది.ఈ పద్దతి లో కొన్ని లోపాలు ఉన్నాయి అంటూ కోర్టు కు థియేటర్ల యాజమాన్యాలు విన్నవించడంతో కోర్టు వారి వాదనలను వినేందుకు గాను సదరు విధానంపై స్టే విధించడం జరిగింది.

నిర్మాత లు మరియు థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్న దాని ప్రకారం ఎలాంటి లోటు పాట్లు ఆన్ లైన్‌ టికెట్ల విధానం లో లేదు అంటూ ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు.

కేవలం బ్లాక్ టికెట్లకు అనుకూలం గా ప్రభుత్వ ఆన్‌ లైన్‌ టికెట్‌ బుకింగ్‌ వ్యవస్థ లేదు అనే ఉద్దేశ్యం తో ఇలాంటి పనులు థియేటర్ల వారు చేస్తున్నారని… కచ్చితంగా కోర్టు లో ప్రభుత్వం కు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంను ప్రభుత్వం వర్గాల వారు అంటున్నారు.

భవిష్యత్తులో మొత్తం టికెట్ల విధానం కూడా ప్రభుత్వ ఆధీనంలోకి రావడం వల్ల సామాన్యులకు సినిమా అనేది అందని ద్రాక్షా అవ్వదు అంటూ ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap, Ap Tickets, Cmjagan, Tickets, Telugu, System, Tollywood-Movie

గతంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించిన సమయం లో కొందరు విమర్శించారు.వారే ఇప్పుడు టికెట్ల రేట్లు తగ్గిస్తే బాగుంటుందేమో అంటున్నారు.థియేటర్ల ద్వారా వస్తున్న ఆదాయం గననీయంగా తగ్గింది.

ఈ సమయం లో ప్రభుత్వం ఆన్ లైన్‌ టికెట్ల అమ్మకం అనేది భవిష్యత్తు లో సినిమా కు ప్రయోజనం అన్నట్లుగా ప్రభుత్వ తరపు లాయర్ వాదిస్తున్నారు.మొత్తానికి ప్రస్తుతానికి ప్రభుత్వ ఆన్‌ లైన్‌ టికెట్ బుకింగ్ పోర్టల్‌ ను ఆపేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube