మంత్రి పదవి కోల్పోనున్న ఏపీ మంత్రి

ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ పదవి ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.దానికి కారణం ఆరు నెలల్లో ఎదో చట్ట సభల్లో సభ్యుడిగా ఉండాలి.

 Ap Minster Kidari Sravans To Step Down-TeluguStop.com

అయితే ఈ నెల 10 వ తేదీ తో శ్రవణ్ కు ఉన్న ఆరు నెలల గడువు పూర్తి అవుతుంది.దీనితో ఆయన చేత రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ ఏపీ సి ఎం చంద్రబాబు కు సూచించినట్లు తెలుస్తుంది.

దీనితో శ్రవణ్ కు వేరే అప్షన్ దొరకక, తప్పని సరి పరిస్థితుల్లో రాజీనామా కు సిద్దమైనట్లు తెలుస్తుంది.గతేడాది మావోయిస్టు ల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతి చెందిన సంగతి తెలిసిందే.

దీనితో సీ ఎం చంద్రబాబు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అని తెలిపి శ్రవణ్ కు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గా అవకాశం ఇచ్చారు.దీనితో శ్రవణ్ గత ఏడాది నవంబర్ 11న ఆ శాఖ మంత్రిగా భాద్యతలు కూడా చేపట్టారు.

-Telugu Political News

కాగా రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలలోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నిక అవ్వాల్సి ఉంటుంది.లేకుంటే పదవి కోల్పోవాల్సి ఉంటుంది.కానీ ఇప్పటివరకు శ్రవణ్ ఏ చట్ట సభల్లో సభ్యుడిగా ఉండలేకపోవడం తో శ్రవణ్ తో రాజీనామా చేయించాలని గవర్నర్ చంద్రబాబు కు సూచించినట్లు తెలుస్తుంది.ఈ మేరకు రాజ్ భవన్ అధికారులు మంగళవారం సాయంత్రం ఏపీ సర్కార్ కు సమాచారం అందించింది.

మరోవైపు ఈ విషయంపై కిడారి శ్రవణ్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు తెలుస్తోంది.ఆయన సూచన మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube