మాట‌ల‌తోనే ఫేమ‌స్ అవుతున్న ఏపీ మంత్రులు.. శాఖ‌ల ప‌నితీరు ప‌ట్ట‌దా..?

అధికార పార్టీలో మంత్రులుగా ఉండ‌టం అంటే మామూలు విష‌యం కాదు.అది అంద‌రికీ వ‌చ్చే అవ‌కాశం కాదు.

 Ap Ministers Who Are Becoming Famous With Their Words Do The Departments Perform-TeluguStop.com

తిరుగు లేని ప‌వ‌ర్ లాగా భావించే మంత్రి ప‌ద‌వులు విష‌యంలో ప్ర‌తి ఎమ్మెల్యే పోటీ ప‌డుతారు.కానీ అది కొంద‌రికి మాత్ర‌మే వ‌చ్చేఅవ‌కాశం.

అయితే ఇలా వ‌చ్చిన మంత్రి ప‌ద‌విని కాపాడుకోవ‌డంలో కొంద‌రు స‌క్సెస్ అయితే ఆ ప‌ద‌వితో ప్ర‌జ‌ల్లో ఇమేజ్ తెచ్చుకునే వారు ఇంకొంద‌రు ఉంటారు.ఆ మంత్రి ప‌ద‌వుల‌కు వ‌న్నె తెచ్చి ప్ర‌జ‌ల్లో గుర్తింపు తెచ్చుకోవ‌డం ద్వారా మ‌ళ్లీ, మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వులుచేప‌ట్టిన వారు కూడా ఉన్నారు.

అయితే ఏపీ మంత్రుల విష‌యంలో మాత్రం ఇది కొంచెం భిన్నంగా ఉంటోంది.వారు త‌మ మంత్రి ప‌ద‌వుల ద్వారా కాకుండా త‌మ నోటి మాట‌ల‌తోనే ఫేమ‌స్ అవుతున్నారు.

ఆళ్ల నాని, పేర్ని నాని తో పాటుగా మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, కొడాలి నాని లాంటి వారంతా కూడా ఇదే కోవ‌కు చెందిన వారు.వీరంతా ఏ మంత్రిత్వ శాఖ‌కు చెందిన వారో పెద్ద‌గా ప్ర‌జ‌ల‌కు తెలీదు.

కానీ ఫైర్ బ్రాండ్లుగా మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులు.కానీ ఏ శాఖ‌ను ఎంత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారో చెప్ప‌డం చాలామందికి క‌ష్ట‌త‌రం అవుతోంది.

Telugu Alla Nani, Ap Ministers, Jagan, Kodali Nani, Perni Nani, Ycp Ministers, Y

నిజానికి ఒక‌ప్పుడు మంత్రి ప‌ద‌వి చేప‌ట్టే వారంతా కూడా త‌మ ప‌నితీరుతోనే ఫేమ‌స్ అయ్యేవారు.కానీ ఇప్పుడు తీరు మారింది.అంద‌రూ కేవ‌లం నోటి మాట‌ల‌తోనే ప్ర‌తిప‌క్షాల‌ను చెడుగుడు ఆడుకుంటూ ఫేమ‌స్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.తమకు అప్ప‌గించిన మంత్రి శాఖల ద్వారా కాకుండా కేవ‌లం ప్ర‌తిప‌క్షాల మీద చేసే వ్యాఖ్య‌ల‌తోనే రాజకీయాలు చేయ‌డాన్ని మ‌నం చూస్తున్నాం.

ఇది ప్ర‌జ‌ల్లో ఇమేజ్‌ను పెంచుతుందేమో గానీ ప‌ట్టును మాత్రం పెంచ‌ద‌ని చెబుతున్నారు.ఎందుకంటే ప్ర‌జ‌లు చేసిన ప‌నిని గుర్తుంచుకుంటారు గానీ మాట్లాడిన మాట‌ల‌ను కాద‌ని చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube