గెలుస్తాం సరే మెజార్టీ రాకపోతే ..? వైసీపీలో వీరందరికీ అగ్ని పరీక్షే ?

తిరుపతిలో హోరాహోరీగా అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.బీజేపీ-జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ రంగంలో ఉండగా,  టీడీపీ నుంచి పనబాక లక్ష్మి,  వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీపడుతున్నారు.

 Ap Ministers Tension On Tirupati Lok Sabha Election Results And Majority-TeluguStop.com

హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేపడుతూ , తమ పట్టు ఎక్కడా చేజారిపోకుండా చూసుకుంటున్నారు.ఇక్కడ గెలిచేది తామే అని, అన్ని రాజకీయ పార్టీలు  ధీమా  గా ఉన్నాయి అయితే ఫలితం వైసిపికి అనుకూలంగా ఉంటుంది అనే విషయం అందరికీ అర్థమైపోయింది.

ఏపీలో అధికార పార్టీ గా ఉండటం , తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండడంతో,  అక్కడ వైసిపికి గెలుపు పై ఎటువంటి సందేహాలు లేవు .

 Ap Ministers Tension On Tirupati Lok Sabha Election Results And Majority-గెలుస్తాం సరే మెజార్టీ రాకపోతే .. వైసీపీలో వీరందరికీ అగ్ని పరీక్షే -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాకపోతే సాధారణంగా వచ్చే గెలుపు కాకుండా,  భారీ మెజారిటీతో గెలవాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది.ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో,  జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.ఈ మేరకు ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటుు , మరో ఏడుగురు మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు .బీజేపీ నుంచి జాతీయ స్థాయి నాయకులు అంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావడం తో ఎన్నికల ప్రచారాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని జగన్ మంత్రులుు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారుు .తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న సత్యవేడు, శ్రీకాళహస్తితి, గూడూరు,  సర్వేపల్లిి, వెంకటగిరిి, సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి గురుమూర్తి కి భారీ మెజార్టీ రావాలనేది జగన్ టార్గెట్.

 ప్రస్తుతం ఈ ఏడు నియోజకవర్గాల కి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్ని నాని, కొడాలి నాని,  ఆదిమూలపు సురేష్ , అనిల్ కుమార్ యాదవ్,  మేకపాటి గౌతమ్ రెడ్డి, కురసాల కన్నబాబు వంటి వారు ఉన్నారు.ఈ ఎన్నికల లో గెలుపు తో పాటు భారీ మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత అందరిపైనా పడింది.ఒకవేళ మెజారిటీ కనుక తక్కువ వస్తే వీరందరి పైన జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, వీరి ప్రాధాన్యం బాగా తగ్గిపోతుంది అనే భయం సదరు నాయకుల్లో ఉండడంతో గట్టిగానే ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రాజకీయ వ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారట.

#Gautam Reddy #Y.s.jagan #Ratnaprabha #AP Cm #Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు