జగన్ నిర్ణయంతో మంత్రుల్లో వణుకు ? మాజీలయ్యేది ఎంతమందో ?

చాలా కాలంగా ఏపీ మంత్రుల పనితీరుపైన అనేక ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.చాలా మంది మంత్రులు తమ శాఖలపై ఇప్పటికీ సాధించలేకపోవడం, తమ సొంత నియోజకవర్గంలో సైతం అంతంతమాత్రంగానే చూపించగలగడం, మరికొంత మంది మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకువచ్చే విధంగా వ్యవహరించడం ఇలా ఎన్నో వ్యవహారాలు చోటుచేసుకుంటూనే వస్తున్నాయి.

 Ap Ministers Tension On Jagan Decision, Ap Cm Jagan, Ysrcp, Tdp, Elections, Jaga-TeluguStop.com

అయినా ఏపీ సీఎం జగన్ మౌనంగానే ఉన్నారు.ఎక్కడా మంత్రుల వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కనిపించడం లేదు.

తాపీగా తాను చేయాల్సిన వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ జగన్ ముందుకు వెళ్తున్నారు.ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికల తంతు ముగిసింది.

ఎంపిటిసి, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది.ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే దానిపైన ఇప్పుడు జగన్ పూర్తిగా దృష్టి పెట్టారు.

పంచాయతీ ఎన్నికలలో వైసిపి మద్దతుదారులు 80 శాతం వరకు గెలుచుకున్నా, గెలవగలిగిన స్థానాల్లో ఓటమి పాలవడం, మంత్రుల ప్రభావం అంతంత మాత్రంగా ఉండడం వంటివెన్నో చోటు చేసుకున్నాయి.వీటన్నిటి పైన జగన్ ప్రత్యేకంగా జగన్ కు ఒక రిపోర్టు అందింది.

ఇప్పటికే ఏపీ క్యాబినెట్ లో ఉన్న సగం మందికి పైగా మంత్రులను తొలగించి వాటి స్థానంలో కొత్త వారిని నియమించాలనే ఆలోచనతో జగన్ ఉన్నారు.అసలు మంత్రి పదవులు ఇచ్చిన సమయంలోనే పదవీకాలం రెండున్నర సంవత్సరాలని జగన్ ప్రకటించారు.

Telugu Ap Cm Jagan, Ap, Ap Ministers, Chandrababu, Jagan, Mptc, Ministers, Panch

అప్పుడు మంత్రివర్గంలోకి సామాజిక వర్గాల సమతూకం పాటించి మరీ జగన్ వారిని ఎంపిక చేసుకున్నారు.అయితే వారు జగన్ అనుకున్న రేంజ్ లో పనితీరు చూపించలేకపోవడం, ప్రతిపక్షాలు ప్రతి దశలోనూ పట్టు సాధించే విధంగా వ్యవహరిస్తున్నా మంత్రులు చాలామంది ప్రేక్షకపాత్ర వహించడం వంటి కారణాలతో పనితీరు సక్రమంగా లేని వారిని తొలగించి, పూర్తిగా పార్టీకి వీర విధేయులు, మంచి వాక్చాతుర్యం ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకోవాలనే ఆలోచనతో జగన్ ఉండడమే కాకుండా, ఇప్పటికే కొంతమంది పేర్లను సైతం నోట్ చేసుకున్నారట.ఈ ఎన్నికలు ముగియగానే ఆలస్యం చేయకుండా మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని జగన్ నిర్ణయం తీసుకోవడంతో తమ మంత్రి పదవులకు ఎసరు వస్తుందని సగం మందికిపైగా మంత్రులు టెన్షన్ పడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube