బాబును టార్గెట్ చేస్తోన్న ఆ ఇద్ద‌రు మంత్రులు   Ap Ministers Targets CM Chandrababu     2016-12-26   04:29:23  IST  Bhanu C

మంత్రుల ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకుంటున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు వారి ప‌నితీరును స‌మీక్షిస్తూ వారికి ర్యాంకులు, గ్రేడింగ్‌లు ఇస్తున్నారు. లీస్ట్ గ్రేడ్ వ‌చ్చిన మంత్రుల‌కు చంద్ర‌బాబు వార్నింగ్‌లు సైతం ఇస్తున్నారు. ఏ మంత్రి అయినా శాఖా ప‌రంగా త‌ప్పు చేస్తే బాబు అస్స‌లు స‌హించ‌డం లేదు. బాబు వ్యాఖ్య‌ల‌పై మిగిలిన మంత్ర‌లు ఎలా ఉన్నా ఓ ఇద్ద‌రు మంత్రులు మాత్రం తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారన్న టాక్ ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది.

ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌రో కాదు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖా మంత్రి కేఈ.కృష్ణ‌మూర్తి, విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాస‌రావు. సీనియ‌ర్లుగా ఉన్న ఈ ఇద్దరు మంత్రులు చంద్ర‌బాబుపై గుర్రుగా ఉన్నారని స‌మాచారం. కేఈ చంద్ర‌బాబుపై ఎప్ప‌టి నుంచో ర‌గిలిపోతున్నారు. రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు కంటే సీనియ‌ర్ అయిన త‌న‌ను బాబు అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌ని కేఈ ఆవేద‌న‌తో ఉన్నారు. ఈ విష‌యంపై ఆయ‌న ప‌లుసార్లు బ‌హిరంగంగానే త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

త‌న రెవెన్యూ శాఖ‌లో బ‌దిలీల్లో కూడా త‌న ప్ర‌మేయం లేకుండా చేస్తుండ‌డంతో కేఈ బాబుపై ర‌గిలిపోతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న క‌ర్నూలు జిల్లాలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుపై మాట్లాడుతూ చంద్ర‌బాబు ఇక్క‌డ ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేశామ‌ని చెపుతున్నా…అవి శంకుస్థాప‌న‌ల‌కే మాత్ర‌మే ప‌రిమిత‌మ‌ని వ్య‌గ్యంగా వ్యాఖ్యానించారు. కేఈ కావాల‌నే చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసుకుని సెటైర్లు వేశార‌న్న గుస‌గుస‌లు టీడీపీలోనే వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇక ఉత్త‌రాంధ్ర మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు సైతం చంద్ర‌బాబు ఇటీవ‌ల బాగా ప్ర‌యారిటీ త‌గ్గించేశారు. గంటాకు చంద్ర‌బాబు ఏకంగా డ‌బుల్ డిజిట్ స్థాయిలో వార్నింగ్‌లు ఇచ్చేశారు. విశాఖ‌లో గంటాకు యాంటీగా లోకేష్ సైతం కొన్ని డెసిష‌న్లు తీసుకోవ‌డంతో గంటా క‌క్క‌లేక మింగ‌లేక ఉంటున్నార‌ట‌. ఇటీవ‌ల ఆయ‌న ఓపెన్‌గానే టీడీపీలో మూడు అధికార కేంద్రాలు ఉన్నాయ‌ని, ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. వారే చూసుకుంటార‌ని… ఇత‌రుల‌కు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌ర‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఏదేమైనా ఈ ఇద్ద‌రు మంత్రులు ఇటీవ‌ల త‌ర‌చూ టీడీపీ నాయ‌కులతో పాటు కొన్నిసార్లు ఓపెన్‌గానే చంద్ర‌బాబును టార్గెట్‌గా చేసుకుని సెటైర్లు వేస్తున్నారు. మ‌రి ఇవి బాబు వ‌ర‌కు చేర‌లేదా ? చేరినా బాబు లైట్ తీసుకుంటున్నారా ? లేదా వీరిపై చ‌ర్య‌ల‌కు టైం కోసం వెయిట్ చేస్తున్నారా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ కోసం కాస్త వెయిట్ చేయాల్సిందే.

,