తిరుమల వెళ్లి వచ్చిన మంత్రిగారికి కరోనా నిర్ధారణ…సీఎం గారి పరిస్థితి…!  

AP Minister Vellampalli tested corona positive,AP Minister Vellampalli ,Corona, YS Jagan, Tirumala, Corona Symptoms, AP CM - Telugu Ap Cm, Ap Minister Vellampalli, Ap Minister Vellampalli Tested Corona Positive, Corona, Corona Symptoms, Tirumala, Ys Jagan

ఏపీ లో కరోనా కోరలు చాపుతున్న విషయం విదితమే.ఒకపక్క సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవ్వరిని కూడా ఈ మహమ్మారి ఏమాత్రం విడిచిపెట్టడం లేదు.

TeluguStop.com - Ap Minister Vellampalli Tested Positive Covid 19

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ మహమ్మారి బారిన పడగా ఇప్పుడు తాజాగా మరో ఏపీ మంత్రిగారు ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తుంది.విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా సోకింది.

దీంతో ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ఈ విషయం తెలిసి ఆయన సన్నిహితులు అధికారులు టెన్షన్ పడుతున్నారు.

TeluguStop.com - తిరుమల వెళ్లి వచ్చిన మంత్రిగారికి కరోనా నిర్ధారణ…సీఎం గారి పరిస్థితి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇటీవల తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించినట్లు తెలుస్తుంది.అయితే ఇప్పుడు మరో టెన్షన్ ఏంటంటే ఇటీవలే తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్న విషయం తెలిసిందే.

అయితే ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరుకావడం తో ఆయన వెన్నంటే ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుమలలోనే ఉండి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించారు.

అనంతరం సీఎం జగన్ తో పాటు కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు కూడా సమర్పించారు.ఆ సమయంలో అధికారులు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.

వారం రోజుల పాటు ఆయన తిరుమలలోనే ఉండి,ఈనెల 25 వ తేదీన తిరిగి విజయవాడకు చేరుకున్నారు.ఈ క్రమంలోనే మంత్రి గారికి స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.

దీంతో ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.అయితే మంత్రిగారికి కరోనా నిర్ధారణ కావడం తో బ్రహ్మోత్సవాల్లో వెల్లంపల్లి తో పాల్గొన్న సీఎం గారి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు నెలకొన్న మరో టెన్షన్.

మరి దీనిపై సీఎం గారు ఎలా స్పందిస్తారో చూడాలి.

#APMinister #APMinister #Corona Symptoms #YS Jagan #Tirumala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ap Minister Vellampalli Tested Positive Covid 19 Related Telugu News,Photos/Pics,Images..