సొంత పార్టీకి ఏపీ బీజేపీ మంత్రి ఝ‌ల‌క్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మిత్ర ప‌క్షాలైన టీడీపీ-బీజేపీ మ‌ధ్య అంత‌ర్గ‌తంగా ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్న విషయం తెలిసిందే! సంద‌ర్భం దొరికిన‌ప్పుడ‌ల్లా బీజేపీ నేత‌లు కొంద‌రు సీఎం చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు.

 Ap Minister Shock To Bjp And Tdp-TeluguStop.com

చంద్ర‌బాబుకు అండ‌గా ఉంటూ రాష్ట్ర నేత‌ల అసంతృప్తిని చ‌ల్లారుస్తున్నారు.అయితే కేంద్రంలో వెంక‌య్య నాయుడు.

బాబుకు మ‌ద్ద‌తుగా ఉంటే.ఇటు రాష్ట్రంలోనూ బాబుకు అండ‌గా నిలుస్తున్నారు రాష్ట్ర బీజేపీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌!! అంతేకాదు చంద్ర‌బాబు కోసం సొంత పార్టీ నేత‌ల‌కే ఝ‌ల‌క్ ఇచ్చారు!!

భాజ‌పాలో బాబు భ‌క్తిప‌రాయ‌ణుల్లో మంత్రి కామినేని ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు.

వెంక‌య్య త‌ర్వాత ఆ స్థాయిలో బాబును మోసేస్తున్న నాయ‌కుడిగానూ ఆయ‌న‌కు గుర్తింపు ఉంది.ఆయ‌న‌పై గ‌తంలోనూ పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన సంద‌ర్భాలున్నాయి! ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీకి అనుకూలంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌డం ఇప్పుడు భాజ‌పా కార్య‌క‌ర్త‌ల‌కు మ‌రింత‌ మంట‌పుట్టిస్తోంది! నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో భాజ‌పా పెద్ద‌లు చంద్ర‌బాబుతో రాజీప‌డిపోతున్నార‌న్న విమ‌ర్శల‌కు బ‌లం చేకూర్చారు కామినేని!

ఈ మ‌ధ్య త‌మ పార్టీకి చెందిన‌ ఓ మండ‌లా ధ్య‌క్షురాలి ప‌ద‌వి విష‌యంలో కామినేని స్పంద‌న వివాదాస్ప‌దంగా మారింది, ఒప్పందం ప్ర‌కారం కైక‌లూరు మండ‌లాధ్య‌క్షురాలిగా స‌త్య‌వ‌తి రెండున్న‌రేళ్లు ఉండాలి.

ఆ త‌రువాత‌, టీడీపీకి ఆ పీఠం ఇవ్వాలి.ప‌ద‌వి ముగిసినా పీఠం ఇచ్చేందుకు స‌సేమిరా అన‌డంతో టీడీపీ నేత‌లు కామినేనికి ఫిర్యాదుచేశారు.

దీంతో ఆయ‌న వెంట‌నే స్పందించి.స‌త్య‌వ‌తిని ప‌ద‌వి నుంచి దించి టీడీపీకి ఆ స్థానాన్ని అప్ప‌గించే వ‌ర‌కూ చాలా కృషి చేశారు!

ఈ వ్య‌వ‌హారంలో జిల్లా పార్టీ కార్య‌వ‌ర్గ స‌భ్యుడిని కూడా స‌స్పెండ్ చేశారు.

దీంతో స్థానిక బీజేపీ నాయ‌కులు కామినేనిపై తీవ్రంగా మండిప‌డుతున్నారు.బీజేపీకి రావాల్సిన నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో టీడీపీపై ఒత్తిడి తీసుకురావాల‌ని సూచిస్తున్నారు.

ఈ విష‌యంపై పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు! మ‌రి కామినేనిపై చ‌ర్య‌లు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube