ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల విషయంలో స్పందించిన ఏపీ మంత్రి.. ?

సునామి వచ్చే ముందు ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందని అంటారు ప్రస్తుతం కరోనా విషయంలో ఈ మాట నిజమనిపిస్తుంది.కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చాక ఒక్క సారిగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

 Ap Minister Responds To Private Hospital Fees-TeluguStop.com

ఆ తర్వాత సెకండ్ వేవ్ అంటూ కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మాత్రం గత నెల నుండి ఆపకుండా పరుగుల వేట దేశంలో కొనసాగిస్తుంది.

ఈ క్రమంలో పుట్టగొడుగుల్లా కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి.

 Ap Minister Responds To Private Hospital Fees-ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల విషయంలో స్పందించిన ఏపీ మంత్రి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఊహించని ఈ కోవిడ్ ఉదృతి వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడిందని, ప్రైవేటు ఆసుపత్రులు బిల్లుల మోత మోగిస్తున్నాయనే వార్తలు ప్రచారం జరుగుతుండగా ఈ విషయంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.

కరోనా పేషంట్ల నుండి అధిక ధరలు వసూలు చేసే ఆసుపత్రులను సీజ్ చేయడమే కాకుండా, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి తప్పిస్తామని హెచ్చరించారు.

కాగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వసూలు చేస్తున్న చార్జీలపై ప్రత్యేక జీవో తీసుకువచ్చామని, పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

#AP Minister #Peddireddy #Remove #Fees

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు