ప్రత్యర్థులపై ఏపి మంత్రి ఆర్.కే.
రోజా తిరుమల వేదికగా విమర్శల వర్షం కురిపించారు.ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో మంత్రి ఆర్.కే.రోజా, ఏపి ఛీఫ్ విప్ ప్రసాద్ రాజులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో చాలా సంతోషంగా మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు.వైసిపి పాలన మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్లీనరి సమావేశాలకు అద్భుత స్పందన వచ్చిందన్నారు.
గతంలో 17 మంది ముఖ్యమంత్రులు చేయని అభివృద్ది పనులకు సీఎం జగన్ చేశారన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో కేంద్రం ఏపీకి మొదటి స్థానం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
బిజినెస్ ర్యాంకింగ్ లో రెండవ సారి మొదటి స్థానం సంపాదించడం విమర్శలు చేస్తున్న టీడీపీకి, అలాగే వాగే ప్రతి పార్టీకి ఇది చెప్పు దెబ్బన్నారు.కోవిడ్ సమయంలో పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటూ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది అన్నారు.
ఇప్పటికైనా టీడీపీ నేతలు బుద్ది తెచ్చుకుని విమర్శలు మాని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని మంత్రి రోజా పేర్కొన్నారు.







