నీ బాబు వల్లే కాలేదు నీ వల్లేం అవుతుందని లోకేష్ పై కొడాలి నాని విమర్శలు.. ?

ఏపీ రాజకీయాలు ఒక్కో సారి టాం అండ్ జెర్రీ ఆటను తలపించేలా సాగుతాయని అనుకుంటున్నారట కొందరు.దీనికి తగ్గట్టుగానే వైసీపీ పై టీడీపీ వేసే కౌంటర్స్, అలాగే టీడీపీ కూడా ప్రతిగా మాటలు విడవడం మొత్తానికి ఒకరి మీద ఒకరు విమర్శించుకునే తీరు గమ్మత్తుగా ఉంటుందట.

 Ap Minister Kodali Nani Shocking Comments On Nara Lokesh , Andhrapradesh, Kodal-TeluguStop.com

ఇలా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్దాలు కామన్‌గా మారాయి.ఈ క్రమంలో ఆటలో అరటి పండులా వచ్చే లోకేష్‌ను కూడా, వైసీపీ కీలక నాయకులు బాగానే ఆడేసుకుంటున్నారనే ప్రచారం ఉంది.

ఇక కొడాలి నాని మాటల వాటం గురించి చెప్పవలసిన అవసరం లేదు.కాగా తాజాగా చంద్రబాబు, లోకేష్‌ల పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు నాని.

జయంతికి, వర్ధంతికి తేడా తెలియని లోకేష్, వైసీపీని ఎదుర్కోవడం నీ బాబు వల్లే కాలేదు నీ వల్లేం అవుతుందని మాట్లాడుతున్నావ్.ప్రస్తుతం జగన్ దెబ్బ ఎలా ఉంటుందో మీ తండ్రి, కొడుకులు రుచి చూశారని అయినా కూడా ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు.

అదీగాక చావు దెబ్బతిని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఘాటుగానే మాటలు విసిరారు నాని.ఈ మాటలు మనకు కొత్తగా అనిపించ వచ్చుగానీ నాయకులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా కాదు అని అనుకుంటున్నారట వీరి వాదనలు విన్న ప్రజలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube