ఏపీ ప్రతిపక్ష నేత లోకేశా? లేక చంద్రబాబా?

గత కొద్దిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాల దెబ్బకి వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి.

 Kodali Nani Counter To Nara Lokesh, Ysrcp, Ycp, Tdp , Naralokesh, Kodali Nani ,-TeluguStop.com

ఈ తరుణంలోనే వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో మరికొన్ని రోజుల్లోనే చేతికి వస్తుంది అనుకున్న పంట పూర్తిగా నీట మునిగిపోయింది.లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆవేదనలో మునిగిపోయారు.

ఇక ఇదే అంశం పై రాష్ట్రంలో ఇప్పుడు తెలుగు దేశం , వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది.

మీ ప్రభుత్వం చేతగాని తనం వల్లే రాష్ట్రంలో వరదలు అంటూ టీడీపీ నేతలు వైసీపీ నేతలపై మాటల యుద్దానికి దిగుతున్నారు.ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు , నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు.

ఈ సమయంలో నారా లోకేశ్, కొడాలి నాని మధ్య మాటల తూటాలు పేలాయి.

వైసీపీ అధికారంలోకి వస్తే రైతు రాజ్యం నడుస్తుందని చెప్పిన జగన్… ఇప్పుడు రాష్ట్రంలో రైతే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలోని 11 జిల్లాల్లో దాదాపు 8వేల ఇళ్లు నీట మునిగాయని, 14 మంది ప్రాణాలు కోల్పోయారని… దీనికంతా వైపీపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని లోకేశ్ విమర్శలు గుప్పించారు.సీఎంత్రి జగన్ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు.

లేని పక్షంలో ప్రజల తరపున టీడీపీ ఉద్యమిస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ ఫోన్ చేసిన తర్వాత వరదలపై జగన్ సమీక్ష నిర్వాహించారని ఎద్దేవా చేశారు.

లోకేష్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చిన మంత్రి కొడాలి నాని , రాష్ట్రానికి ప్రతిపక్ష నేత లోకేశా? లేక చంద్రబాబా? అని ప్రశ్నించారు.మంగళగిరిలో ఓడిపోయిన లోకేశ్ ఏం చూసొచ్చారని ప్రశ్నించారు.

లోకేశ్ కు కళ్లు ఇంకా నెత్తిమీద ఉన్నాయని, వచ్చే రోజుల్లో కిందకు దింపుతామని అన్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube