వైకాపా నేత‌ల‌తో కుమ్మ‌క్కు అయిన ఏపీ మంత్రి     2017-01-02   07:04:59  IST  Bhanu C

నెల్లూరులో రాజ‌కీయాలు స్వ‌ప‌క్షంలోనే విప‌క్షాన్ని త‌ల‌పిస్తున్నాయి. టీడీపీ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి, వైసీపీ నేత, ఎమ్మెల్యే కాకానిల భూవివాదం జిల్లా రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తోంది. నేత‌ల ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల‌తో ఇరు పార్టీల్లోనూ కాక మొద‌లైంది. సోమిరెడ్డి అక్ర‌మ ఆస్తులు కూడ‌బెట్టార‌ని కాకాని చేసిన వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అయితే ఈ విష‌యంలో అదే జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణ ఇప్ప‌టివ‌ర‌కూ మాట్లాడ‌క‌పోవ‌డం సందేహాల‌కు తావిస్తోంది. వైసీపీ నేత‌ల‌తో కుమ్మ‌క్కై సోమిరెడ్డిపై ఇలా విమ‌ర్శ‌లు చేయిస్తున్నారా? అని కొంద‌రు సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు.

సోమిరెడ్డి వ‌ర్సెస్ కాకాని మ‌ధ్య వార్ తార‌స్థాయికి చేరింది. అయితే ఈ వ్య‌వ‌హారంలో సోమిరెడ్డికి మ‌ద్ద‌తుగా జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణ ఒక్క‌సారి కూడా మాట్లాడ‌క‌పోవ‌డంపై నేత‌లు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా నారాయ‌ణ వ్య‌వ‌హార‌శైలి విమర్శ‌ల‌కు తావిస్తోందని చెబుతున్నారు. జిల్లాకు చెందిన నారాయ‌ణ‌ కీల‌క‌మైన మున్సిప‌ల్ శాఖ మంత్రి, సీఆర్డీఏలో కీల‌క‌మైన బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అలాగే రాజ‌ధాని ప్రాంతంలో వంద‌ల భూములు కొన్న‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణలు ఉన్నాయి. అయినా వాటిని ప‌క్క‌న‌పెట్టి.. ఎమ్మెల్సీ సోమిరెడ్డినే వైసీపీ నేత‌లు ఎందుకు టార్గెట్ చేసుకున్నార‌ని సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి.

మంత్రి నారాయణ వ్యవహారశైలిపై వారికీ తీవ్ర అసంతృప్తి ఉంది. జిల్లాలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని టీడీపీ నేత‌లే విమర్శిస్తున్నారు. టీడీపీ కష్ట కాలంలో ఉన్న సమయంలో వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి..పార్టీకి వాయిస్ గా నిలిచింది సోమిరెడ్డే. మంత్రి నారాయణ ఎప్పుడూ కూడా జగన్ పై ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత కూడా సోమిరెడ్డిపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాల్సిందిగా ఎవరికీ సూచించిన దాఖలాలు లేవని పార్టీ వర్గాలు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.